హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని పటాన్‌చెరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్-ముంబై హైవేపై గుర్తుతెలియని వాహనం స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న అన్నాచెల్లెలు అక్కడికక్కడే మృతిచెందారు.

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో అమీన్పూర్ ప్రాంతానికి చెందిన అన్నా చెల్లెలు పూజారి సాయి తేజ, సుస్మితలు ఘటనా స్ధలంలోనే మృతిచెందారు. వారు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టిన వాహనం ప్రమాదం తర్వాత కూడా ఆపకుండా అక్కడి నుండి వెళ్లిపోయింది. 

read more  బెంగళూరులో మిస్సింగ్... హైదరాబాద్ లో ఇంజనీరింగ్ స్టూడెంట్ మృతదేహం

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొన్నారు. మృతదేహాల వద్ద లభించిన వస్తువల ఆధారంగా వారి వివరాలు తెలుసుకుని  కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న రామచంద్రాపురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు తెలుసుకునేందుకు వివిధ కోణాల్లో విచారణ సాగిస్తున్నారు. 

read more  భూవివాదంలో పోలీసుల జోక్యం... వేధింపులతో రైతు ఆత్మహత్యాయత్నం

ఇంట్లోంచి బయటికి వెళ్లిన ఇద్దరు పిల్లలు ఇలా విగతజీవులుగా తిరిగిరావడంతో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. ప్రమాదంలో ఒకేసారి పిల్లలిద్దనికి కోల్పోవడంతో తల్లిదండ్రుల రోదనలు చూసేవారికి కూడా కన్నీరు పెట్టిస్తున్నాయి.