హైదరాబాద్: రిటైర్ట్ ఐఎఎఎస్ , మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తండ్రి బీఎస్ యుగంధర్ అంత్యక్రియలు ఆదివారం నాడు ఉదయం మహాప్రస్థానంలో పూర్తయ్యాయి.

రిటైర్డ్ ఐఎఎస్ యుగంధర్ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. తండ్రి మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే సత్య నాదెళ్ల అమెరికా నుండి ఆదివారం నాడు ఉదయం హైద్రాబాద్ కు వచ్చారు. 

సత్య నాదెళ్ల వచ్చిన వెంటనే బీఎస్ యుగంధర్ అంత్యక్రియలను పూర్తి చేశారు.  హైద్రాబాద్ లోని మహా ప్రస్థానంలో  అంత్యక్రియలు పూర్తి చేశారు.మహా ప్రస్థానంలో బీఎస్ యుగంధర్ అంత్యక్రియలను పురస్కరించుకొని  పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

సత్యనాదెళ్ల తండ్రి, రిటైర్డ్ ఐఎఎస్ కన్నుమూత