హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు సమీపంలోని మైలార్ దేవ్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై కనిపించిన చిరుతపులిని పట్టుకోవడానికి అధికారులు గత 26 గంటలుగా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. జాతీయ రహదారిపై దర్జాగా పడుకున్న చిరుతను చూడడానికి గురువారం ఓ లారీ డ్రైవర్ ప్రయత్నించాడు. అతనిపై దాడి చేసి చిరుత పరారైంది.

Also Read: హైదరాబాదులో కలకలం: లారీ డ్రైవర్ పై దాడిచేసి పారిపోయిన చిరుత

అప్పటి నుంచి దాని ఆచూకీ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. అది సమీపంలోని ఫామ్ హౌస్ లోకి వెళ్లినట్లు భావించారు. ఫామ్ హౌస్ లో దాని అడుగుజాడలు కనిపించాయి. అయితే, ఇది ఫామ్ హౌస్ నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అది వ్యవసాయ విశ్వవిద్యాలయం అటవీ ప్రాంతంలోకి గానీ హిమాయత్ సాగర్ వైపు గాని వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. 

Video: లారీ డ్రైవర్ పై చిరుత దాడి.. కాటేదాన్‌, బుద్వేల్‌ లో హై అలర్ట్

చిరుత ఆచూకీ కోసం 24 సీసీ కెమెరాలను వాడుతున్నారు. అది ఎప్పుడు ఏ విధంగా దాడి చేస్తుందోననే భయాందోళనలు చోటు చేసుకున్నాయి. అయితే, అడుగుజాడలను బట్టి చిరుతను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని, ఎవరూ భయపడవద్దని డీసీపీ ప్రకాశ్ రెడ్డి అన్నారు.