హైదరాబాద్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నాయకులు శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్ లో పర్యటించారు. ప్రత్యేక విమానంలో కుటుంబ సమేతంగా నగరానికి చేరుకున్న ఆయన నేరుగా ముచ్చింతల్ కు వెళ్లి చినజియర్ స్వామిని దర్శించుకున్నారు. ఆయన ఇవాళ ఆశ్రమంలోనే బస చేయనున్నట్లు సమాచారం.  

ప్రత్యేక విమానంలో నేరుగా ఎయిర్ పోర్టు కు చేరుకున్న చౌహాన్ కుటుంబానికి స్థానిక బిజెపి నాయకుుల ఘన స్వాగతం పలికారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ బీజేపీ నేత బుక్క వేణు గోపాల్ శివరాజ్ సింగ్ కు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. 

స్కూటీని ఢీకొన్న ఆర్టీసి బస్సు...టీసిఎస్ ఉద్యోగిని మృతి, డ్రైవర్ పై రాళ్లదాడి

అక్కడినుండి ఆశ్రమానికి వెళ్లిన చౌహాన్ చినజీయర్ స్వామిజి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను జియర్ స్వామికి పరిచయం చేశారు. ఈ క్రమంలో వారితో ఆత్మీయంగా మాట్లాడిన స్వామి ఆశీర్వాదం అందించారు. 

మధ్య ప్రదేశ్ మాజీ సీఎం చౌహాన్ ను మైహోం అధినేత రామేశ్వరరావు కూడా కలుసుకున్నారు. ఆశ్రమానికి విచ్చేసిన చౌహాన్ కు రామేశ్వరరావు శాలువాతో సత్కరించిన ఆశ్రమ ప్రాంగణలోని ఆలయాలకు వారిని తీసుకెళ్లి ప్రత్యేకంగా పూజలు చేయించారు.