హైదరాబాద్: వారం రోజులుగా చిరుతపులి హైదరాబాదులో అటవీశాఖ అధికారులను ముప్పు తిప్పలు పెడుతోంది. వారం రోజుల క్రితం కాటైదాన్ ప్రాంతంలో రహదారిపై పడుకున్న చిరుతను పట్టుకోవడానికి అధికారులు ప్రయత్నించారు. అప్పటి నుంచి దాని కోసం గాలింపు జరుపుతూనే ఉంది. 

ప్రస్తుతం హిమాయత్ సాగర్ ఒడ్డున జీవీకె గార్డెన్స్ లోని స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు తాగుతుండడాన్ని గమనించిన వాచ్ మన్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అయితే, మత్తు మందు ఇచ్చి పట్టుకునేలోగానే అది పారిపోయింది. సమీపంలోని అడవిలోకి అది పారిపోయినట్లు భావిస్తున్నారు. 

Video: చిరుత లారీ డ్రైవర్ పై ఇలా దాడి చేసి.. అలా పారిపోయింది

జీవీకె గార్డెన్స్ లో సీసీ కెమెరాలను, బోనును అధికారులు ఏర్పాటు చేశారు.  వారం రోజుల క్రితం ఓ లారీ డ్రైవరుపై దాడి చేసిన చిరుత పారిపోయింది. అది సమీపంలోని ఫామ్ హౌస్ లోకి పారిపోయినట్లు అధికారులు గుర్తించి వేట ప్రారంభించారు. అయితే, దాని జాడ కనిపించలేదు.

చిరుతపులి ఆచూకీ కనిపెట్టడానికి అధికారులు కుక్కలను కూడా వదిలారు. చిరుతపులి స్థానికంగా ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది.

Video: చిలుకూరు అడువుల్లోకి పారిపోయిన చిరుత.. అటవీశాఖ నిర్థారణ