ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గుడ్స్‌ను డెలివరీ చేసే ఓ సంస్ధలో జరిగిన సంఘటన విషాదంగా ముగిసింది.  డిసెంబర్ 4న  ఆ సంస్థలో జరిగిన  గొడవలో తీవ్రంగా గాయపడిన శివరాం మృతి చెందాడు. ఓ ప్రవైట్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ  చనిపోయాడు.   వివరాల్లోకి వెళితే... ఈ నెల 5న అమెజాన్ హైదరాబాద్ ఆఫీస్‌లో   శివరాం, మునీర్ అనే ఉద్యోగులు ఒకరిపై ఒకరు దాడికి చెసుకున్నారు.

యువతి శరీరంలో బుల్లెట్: తేల్చని పోలీసులు,అనుమానాలు

ASCA మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌తో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న వి. శివారం అందులో డెలివరీ బాయ్‌గా పనిచేసే  మునీర్ మధ్య  వివాదం చోటుచేసుకుంది. ఇది చివరకు వారిద్దరి తీవ్ర ఘర్షణకు దారి తీసింది.  ఈ దాడిలో   శివరాంను మునీర్  తీవ్రంగా గాయపరచాడు.

దీంతో శివరాం కోమాలోకి వెళ్లిపోయాడు. వెంటనే స్పందించిన  సహోద్యోగులు దగ్గరలోని యశోద ఆస్పత్రికి తరలించారు. తర్వాత మునీర్‌పై కుటుంబసభ్యులు  గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మునీర్‌‌ను  అరెస్ట్ చేశారు.  అనంతరం అతను  బెయిల్‌పై బయటకు వచ్చేశాడు. 

17 హత్యల సీరియల్ కిల్లర్: అదే బైక్, దాని మర్మంపై పోలీసుల ఆరా

అయితే గత కొద్దీ రోజులుగా ఐసీయిలో చికిత్స పోందుతున్న అతను సోమవారం మృతి చెందాడు. ప్రస్తుతం వారి గొడవకు సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సకాలంలో వస్తువులను డెలివరి చేయడం లేదని మునీర్‌పై శివరాం మెనేజ్‌మెంట్ ఫిర్యాదు చెయడంతోనే
వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.