Asianet News TeluguAsianet News Telugu

 Hyderabad:  స్వాతంత్య్ర  వేడుకల్లో విషాదం.. మాట్లాడుతూ కుప్ప‌కూలిన‌ వ్యక్తి ..

Hyderabad: స్వాతంత్య్ర వేడుక‌ల్లో విషాద ఘటనచోటుచేసుకుంది.  హైదరాబాద్‌లో ఆజాదీ కా అమృత మహోత్సవం జరుపుకుంటున్న వేళ, జెండా వందనం కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి మాట్లాడుతూనే, గుండె పోటుకు గురై హఠాన్మరణం చెందారు. ఈ షాకింగ్‌ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

Hyderabad Man collapses, dies while giving Independence Day speech
Author
Hyderabad, First Published Aug 16, 2022, 5:46 AM IST

Hyderabad: ఎవ‌రి జీవితం ఎప్పుడు.. ఎక్కడ..ఎలా ముగిసిపోతుందో  చెప్పడం చాలా కష్టం. ఈ క్ష‌ణం బాగున్నా మ‌రుక్ష‌ణం ఎలా ఉంటుందో?  ఏం జ‌రుగుతోందో ? ఎవ‌రూ ఊహించ‌లేరు.. కాసేప‌టి క్రితం వ‌ర‌కు మ‌నతో స‌రాద‌గా ఉన్న‌వ్య‌క్తికి అనుకోని ప్ర‌మాదాన్ని ఎదుర్కొవ‌చ్చు. ఆ వ్య‌క్తి  ఆక‌స్మాత్తుగా మ‌ర‌ణించ‌వ‌చ్చు. ఇప్పుడు స‌రిగ్గా అలాంటి ఓ ఘ‌ట‌న‌నే వెలుగులోకి వ‌చ్చింది. స్వాతంత్య్ర వేడుక‌ల్లో అప్ప‌టి వ‌ర‌కు అంద‌రితో ఉత్సాహంగా, స‌రాద‌గా క‌లిసి ఉన్న వ్య‌క్తి.. మాట్లాడుతూ.. మాట్లాడుతూనే.. ఆక‌స్మాత్తుగా మ‌ర‌ణించాడు. ఈ విషాద ఘ‌ట‌న హైద‌రాబాద్ లో చేసుకుంది. ఈ ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారుతోంది. 
  
వివ‌రాల్లోకెళ్తే..  హైదరాబాద్ కాప్రా ప్రాంతంలోని లక్ష్మీ విలాస్ అనే సొసైటీలో స్వాతంత్య్ర దినోత్సవ  వేడుక‌ల‌ను  ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా  పిల్ల‌ల‌కు, పెద్ద‌ల‌కు ఆట‌పాట‌ల‌ను, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేశారు.  ఆ సోసైటీలో పండుగ వాతావ‌రణం నెల‌కొంది. అంద‌రూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు.  కానీ అంత‌లోనే ఎవరూ ఊహించని షాకింగ్ ఘ‌ట‌న జ‌రిగింది. అప్ప‌టి వ‌ర‌కూ ఉత్సాహంగా.. సర‌దా ఉన్న ఆ పాంత్రం విషాదంలో మునిగిపోయింది. 
 
కుషాయిగూడలోని కాప్రా పరిధిలో గల లక్ష్మి విల్లాస్‌లో ఉప్పల సురేష్ అనే వ్యాపారి జెండా వందనంలో పాల్గొన్నారు. అప్పటివరకు అందరితో చాలా స‌ర‌దాగా మాట్లాడుతూ ఉన్నాడు. అనంత‌రం స్టేజ్‌పైకి వెళ్లి
మైక్ ప‌ట్టుకుని ప్రసంగిస్తుండగా సురేష్‌కు హఠాత్తుగా గుండెపోటు వ‌చ్చింది.  హఠాత్తుగా కుప్పకూలారు.

 దీంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండె పోటు రావడంతో సురేష్‌ మృతి చెందినట్లు తెలిపారు. దీంతో  అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ అతను చనిపోయినట్లు డాక్టర్ ప్రకటించాడు. ఈ దుర్ఘటన తర్వాత సభ్యసమాజం అంతా కాసేపటికే నీలినీడల్లోకి వెళ్లిపోయింది. చూడగానే ఒక వ్యక్తి ఇలా చనిపోతాడని ఎవరూ అనుకోలేదు. ఒక్కసారిగా సంతోషకరమైన కార్యక్రమం సంతాప కార్యక్రమంగా మారింది. 


 విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు మృతి.. 

తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో సాధారణ ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్య్ర వేడుకలు జరుపుకున్నారు. అయితే ఇంతలో సంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో త్రివర్ణ పతాకాన్ని పైకప్పుపై ఉంచే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. త్రివర్ణ పతాకం ఉన్న కర్ర విద్యుత్ లైన్‌కు తగలడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ, ఇద్దరికి గాయాలు

తెలంగాణలోని జనగాం జిల్లాలో సోమవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర శాఖ చీఫ్ బండి సంజయ్ కుమార్ చేపట్టిన 'పాదయాత్ర' సందర్భంగా రాష్ట్ర అధికార టిఆర్‌ఎస్, బిజెపి కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. దేవరుప్పలలో జరిగిన ఘర్షణలో రాళ్ల దాడి కూడా జరిగిందని, ఇందులో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios