హైదరాబాద్: ఓ వ్యక్తి తన భార్యను చంపి, రాత్రంతా ఆమె శవం పక్కనే నిద్రించిన సంఘటన హైదరాబాదులోని లంగర్ హౌస్ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. మద్యం మత్తులో అతను భార్యతో గొడవ పడ్డాడు. ఆ తర్వాత ఆమెను చంపేసి, రాత్రి ఆమె శవం పక్కన నిద్రించాడు. తెల్లారి లంగర్ హౌస్ పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. 

లంగర్ హౌస్ ఇన్ స్పెక్టర్ సీహెచ్ శ్రీనివాస్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కోస్గి మండలం ముసిరప్ప గ్రామానికి చెందిన ఎల్లప్ప, అమృతమ్మలు భార్యాభర్తలు. వీరికి ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారు. 

Also Read: అనుమానం.. తాగిన మత్తు.. భార్యను చంపిన భర్త

వీరు కొన్నేళ్లుగా లంగర్ హౌస్ లోని మందుల బస్తీలో నివాసం ఉంటూ కూలీపనులు చేసుకునేవారు. భార్యాభర్తల మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి. చాలాసార్లు గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి ఇరువురి మధ్య రాజీ కుదిర్చారు. 

మంగళవారం రాత్రి ఇంట్లో మద్యం తాగిన ఎల్లప్ప భార్యతో గొడవ పడ్డాడు. ఆర్థరాత్రి గొంతు నులిమి, ఆ తర్ావత ఇంట్లోని చిన్న సిలిండర్ తో కొట్టి ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహం పక్కనే పడుకున్నాడు. 

Also Read: బాలీవుడ్ హీరోపై మోజు... అసూయతో భార్యను చంపిన భర్త

మర్నాడు ఉదయం బుధవారం ఉదయం 8 గంటలకు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. 2013లో కొడంగల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఓ వ్యక్తి హత్య కేసులో ఎల్లప్ప నిందితుడు.