బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే ఆమెకు  పిచ్చి. అతని సినిమాలు చూడటం, పాటలు వినడం అంటే మహా ఇష్టం. ఆ ఇష్టమే ఆమె ప్రాణం తీసింది. తాను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న భార్య.. తనని కాకుండా ఓ బాలీవుడ్ హీరోని ఇష్టపడటం అతను తట్టుకోలేకపోయాడు. దీంతో... భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన న్యూయార్క్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... భారత్ కి చెందిన దినేశ్వర్ బుద్ధిదాత్, అతని భార్య డోన్నే డోజోయ్(27)లు అమెరికాలో స్థిరపడ్డారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులు న్యూయార్క్ లోని క్వీన్స్ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. కాగా.. డోజోయ్.. ఓ బార్ టెండర్ గా పనిచేస్తోంది. కాగా.. ఆమెకు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే పిచ్చి.

భర్త కన్నా కూడా ఎక్కువ ప్రేమ హీరోపైనే చూపించేది. ఎప్పుడూ హృతిక్ సినిమాలు చూడటం, పాటలు వినడం లాంటివి చేసేది. తాను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన భార్య తనను పట్టించుకోకుండా హీరో పై అంత ప్రేమ చూపించడాన్ని అతను తట్టుకోలేకపోయాడు. చాలాసార్లు  హీరోపై ప్రేమను తగ్గించుకోవాలని చాలాసార్లు హెచ్చరించాడు. అయితే... ఆమె మాత్రం తన తీరును మార్చుకోలేదు.

దీంతో అతని లో కోసం అసూయ రోజు రోజుకీ ఎక్కువై పోయాయి. ఈ క్రమంలో చాలాసార్లు గొడవకూడా పడ్డారు. హృతిక్ సినిమాలు  చూడొద్దంటూ ఆంక్షలు విధించడం మొదలుపెట్టాడు. ఈ ఏడాది ఆగస్టులో హృతిక్ విషయంలో ఏర్పడ్డ గొడవతో దినేశ్వర్ భార్యను చిత్ర హింసలకు గురిచేశాడు. దీంతో... అతని టార్చర్ భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది.

ఆమె ఫిర్యాదు మేరకు దినేశ్వర్ ని పోలీసులు అరెస్టు చేశారు. కొద్ది రోజులు జైలు శిక్ష అనంతరం ఇంటికి చేరుకున్న దినేశ్వర్.. తాను మారినట్లు నటించాడు. కానీ తనను జైల్లో పెట్టించిందనే కోపంతో... ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం ఇంటికి  సమీపంలోని ఓ చెట్టుకి ఉరివేసుకొని అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే... ఈ ఘటనపై డోజోయ్ స్నేహితులు మాట్లాడుతూ... దినేశ్వర్ కి భార్య అంటే ఎంతో ప్రేమ అని.. కానీ ఆమె హృతిక్ అంటే ఎక్కువ ప్రేమ చూపించడంతో అసూయ పెంచుకున్నాడని.. అందుకే చంపేశాడని చెబుతున్నారు.