హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మె ట్ తహసిల్దార్ మరణం చాలా బాధాకరమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆవేదన  వ్యక్తం చేశారు. ఆమె మరణానికి తీవ్ర సంతాపాన్ని...  కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

ఈ సంఘటన రెవిన్యూ పరమైన సమస్యలను బట్టబయలు చేస్తుందని ఆరోపించారు.  ఒక మహిళా అధికారిని చంపే వరకు వచ్చిందంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోందన్నారు. 

రాష్ట్రంలో వివిధ రకాల భూ సమస్యలు ఉన్నాయని...వాటి విషయంలో అనేక సమస్యలున్నాయన్నారు. వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యం ఉందని పేర్కోన్నారు. రాష్ట్రంలో 57 లక్షల రైతులుంటే 9 లక్షల మందికి పాసు పుస్తకాలు ఇవ్వాల్సి ఇవ్వాల్సి ఉందన్నారు.

read more  అబ్దుల్లాపూర్‌మెట్ దుర్ఘటన... గుర్నాథం కుటుంబానికి ఎమ్మెల్యే సైదిరెడ్డి పరామర్శ

రకరకాల వివాదాలు ఉన్నాయన్న నెపంతో కొన్ని, ప్రభుత్వమే వివాదాలు సృష్టించి మరికొన్ని పాసు పుస్తకాలు ఇవ్వకుండా కాలక్షేపం చేస్తున్నారన్నారు. ఈ దాడి వెనుక ఎవరైనా ఉంటే వారిని కూడా గుర్తించాలని...ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. 

ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే తక్షణమే ఒక యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. మిగతా తొమ్మిది లక్షల మంది రైతులకు పాస్ పుస్తకాలను అందించాలని కోరుతున్నామని రాఘవులు తెలిపారు. 

సోమవారం నాడు అబ్దుల్లాపూర్‌ మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డిపై సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.మంటల్లో చిక్కుకొన్న ఎమ్మార్వో విజయారెడ్డిని కాపాడేందుకు డ్రైవర్ గురునాథం తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ ఘటనలో గురునాథానికి 80 శాతం గాయాలయ్యాయి. దీంతో ఆయనను డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ గురునాథం మంగళవారం నాడు ఉదయం మృతి చెందాడు. 

read more  tahsildar Vijaya Reddy: నిందితుడు సురేష్ పరిస్థితి ఆందోళనకరం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని  అబ్దుల్లాపూర్‌మెట్టు తహసీల్దార్ కార్యాలయంలోకి ఓ దుండగుడు సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు వచ్చాడు.తహసీల్దార్ విజయారెడ్డితో మాట్లాడాలంటూ ఆమె చాంబర్‌లోకి వెళ్లాడు. తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లిన ఆ దుండగుడు ఆమెపై పెట్రోల్ పోశాడు. వెంటనే ఆమెకు నిప్పంటించాడు.

అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు  విజయారెడ్డిపై మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. దీంతో విజయారెడ్డిని కాపాడేందుకు డ్రైవర్ గురునాథం, అటెండర్ చంద్రయ్య ప్రయత్నించారు. డ్రైవర్ గురునాథం 80 శాతం కాలిపోయాడు. చంద్రయ్య 60 శాతం కాలిపోయాడు.

సూర్యాపేట జిల్లాకు చెందిన గురునాథం సుమారు ఆరు ఏళ్లుగా పనిచేస్తున్నాడు. విజయారెడ్డిని తన సోదరిగా గురునాథం భావించాడు. దీంతో ఆమె గురునాథాన్నే తన డ్రైవర్ గా కొనసాగించింది. 

డ్రైవర్ గురునాథం విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన క్రమంలో తీవ్రంగా గాయపడ్డారు. గురునాథం కుటుంబం చాలా పేద కుటుంబం. విజయారెడ్డి కుటుంబంలో సభ్యుడిగా గురునాథం ఉండేవాడని ఆ కుటుంబానికి చెందిన వాళ్లు చెబుతున్నారు.