సూర్యాపేట: తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులో దారుణ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అబ్దుల్లాపూర్‌మెట్ మండలకేంద్రంలో తహసీల్దార్ విజయా రెడ్డి పై దుండుగడి దాడిలో ఆమె మృతిచెందడంతో పాటు డ్రైవర్ గుర్నాథం తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృత్యువాతపడ్డాడు. ఈ నేపథ్యంలో అతడి కుటుంబాన్ని హుజుర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పరామర్శించారు. 

గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామనికు చెందిన కామల్ల గురునాథం అబ్దులపూర్‌మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే సోమవారం ఎమ్మార్వో కార్యాలయంలో జరిగిన ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. మంటల్లో కాలిపోతున్న విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడు  నిన్నటి నుండి నగరంలోకి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ(మంగళవారం) ఉదయం మరణించాడు.    

read more  video: జగన్ సొంత జిల్లాలో దారుణం: ఎమ్మార్వో కార్యాలయంలోనే అన్నదాత ఆత్మహత్యాయత్నం

హైదరాబాదులో గుర్నాథం మృతదేహాన్ని పరిశీలించి అనంతరం ఆయన కుటుంబాన్ని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి  పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ... నిన్న జరిగిన ఘటనలో ఎమ్మార్వో విజయ రెడ్డి  మృతిచెందడం, నేడు చికిత్స పొందుతూ గుర్నాథం మృతి చాలా బాధాకరమని అన్నారు.

గురునాథం స్వగ్రామమైన గరిడేపల్లి మండలం వెల్దండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గుర్నాథం కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని... వారి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్, ఆర్డిఓ, సంబంధిత అధికారులతో మాట్లాడటం జరిగిందన్నారు.  గురునాథం కుటుంబానికి అన్ని విధాల న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే సైదిరెడ్డి  హామీ ఇచ్చారు. 

సోమవారం అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డిపై సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.మంటల్లో చిక్కుకొన్న ఎమ్మార్వో విజయారెడ్డిని కాపాడేందుకు డ్రైవర్ గురునాథం తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ ఘటనలో గురునాథానికి 80 శాతం గాయాలయ్యాయి. దీంతో ఆయనను డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ గురునాథం మంగళవారం నాడు ఉదయం మృతి చెందాడు.

read  more  tahsildar Vijaya Reddy: అందుకే పెట్రోల్ పోసి నిప్పంటించానని సురేష్

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని  అబ్దుల్లాపూర్‌మెట్టు తహసీల్దార్ కార్యాలయంలోకి ఓ దుండగుడు సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు వచ్చాడు.తహసీల్దార్ విజయారెడ్డితో మాట్లాడాలంటూ ఆమె చాంబర్‌లోకి వెళ్లాడు. తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లిన ఆ దుండగుడు ఆమెపై పెట్రోల్ పోశాడు. వెంటనే ఆమెకు నిప్పంటించాడు.

అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు  విజయారెడ్డిపై మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. దీంతో విజయారెడ్డిని కాపాడేందుకు డ్రైవర్ గురునాథం, అటెండర్ చంద్రయ్య ప్రయత్నించారు. డ్రైవర్ గురునాథం 80 శాతం కాలిపోయాడు. చంద్రయ్య 60 శాతం కాలిపోయాడు.

సూర్యాపేట జిల్లాకు చెందిన గురునాథం సుమారు ఆరు ఏళ్లుగా పనిచేస్తున్నాడు. విజయారెడ్డిని తన సోదరిగా గురునాథం భావించాడు. దీంతో ఆమె గురునాథాన్నే తన డ్రైవర్ గా కొనసాగించింది. 

డ్రైవర్ గురునాథం విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన క్రమంలో తీవ్రంగా గాయపడ్డారు. గురునాథం కుటుంబం చాలా పేద కుటుంబం. విజయారెడ్డి కుటుంబంలో సభ్యుడిగా గురునాథం ఉండేవాడని ఆ కుటుంబానికి చెందిన వాళ్లు చెబుతున్నారు.