హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కూకట్ పల్లిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు బైక్ ను ఢీకొట్టడంతో జెఎన్టీయూ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. మరణించిన విద్యార్థిని మునీబ్ గా గుర్తించాడు. కూకట్ పల్లి ప్రధాన రహదారిని దాటేసే క్రమంలో కారు వేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టింది. బైక్ తో పాటు విద్యార్థిని కొంత దూరం లాక్కెళ్లింది.

ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కారు రాష్ డ్రైవింగ్ వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు దృశ్యాలను చూస్తే అర్థమవుతోంది. ఈ ప్రమాదం నుంచి మునీబ్ వెనక వస్తున్న ఓ యువకుడు, రోడ్డు దాటుతున్న ఓ మహిళ తప్పించుకున్నారు.

also Read: కర్మన్‌ఘాట్ వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు

శుక్రవారం మధ్యాహ్నం మునీబ్ బౌన్సర్ వాహనాన్ని అద్దెకు తీసుకుని ప్రార్థనలు చేయడానికి బయలుదేరాడు. జెఎన్టీయూలోని విద్యార్థుల హాస్టల్ నుంచి అతను బయలుదేరాడు. అలా బయలుదేరిన కొద్దిసేపటికే అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 

తీవ్రంగా గాయపడిన మునీబ్ ను అస్పత్రికి తరలించారు. అయితే, అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

See video: బ్రిడ్జి పైనుండి కింద పడ్డ కారు : ఒకరు మృతి