హైదరాబాద్: హైద్రాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  ఆదివారం నాడు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అతివేగం ముగ్గురు నిండు ప్రాణాల్ని బలిగొంది.

మద్యం మత్తులో కారును నడిపిన కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు.  నాగార్జునసాగర్ రోడ్డులో ఉన్న గుర్రంగూడ వద్ద   పార్టీ చేసుకొని తిరిగి వస్తున్న  సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.  

 సాగర్ రింగ్ రోడ్ నుండి చంపాపేట్ వస్తుండగా మార్గమధ్యంలో వద్ద కర్మన్ ఘాట్ వద్ద కారు  ఈ ప్రమాదానికి గురైంది.  TS 11 ఈజీ 0054  నెంబర్  గల కారులో నలుగురు ప్రయాణీస్తున్నారు. కర్మన్‌ఘాట్‌ సమీపంలోకి రాగానే  కారు చెట్టును ఢీకొంది. దీంతో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 

Also read:గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 12 మంది మృతి, నలుగురికి గాయాలు

కారును డ్రైవింగ్ చేస్తున్న మల్లికార్జున్, సాయి రామ్ , సాయి నాద్ లు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు కళ్యాణ్ సిటు బెల్టు పెట్టుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.  గాయాలైన కళ్యాణ్ అనే యువకుడిని వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదం జరిగిన సమీపంలోనే హోటల్ ఉంటుంది.   రద్దీగా ఉన్న సమయంలో ప్రమాదం జరిగి ఉంటే  ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.