Asianet News TeluguAsianet News Telugu

రేవంత్‌కు షాక్: బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కూకట్‌పల్లి కోర్టు

మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బెయిల్ పిటిషన్‌ను కూకట్‌పల్లి కోర్టు బుధవారం నాడు కొట్టివేసింది.

kukatpally court quashes Revanth reddy bail petition
Author
Hyderabad, First Published Mar 11, 2020, 4:57 PM IST


హైదరాబాద్: మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బెయిల్ పిటిషన్‌ను కూకట్‌పల్లి కోర్టు బుధవారం నాడు కొట్టివేసింది.

కేటీఆర్‌ లీజుకు తీసుకొన్న ఫామ్ హైస్ పై డ్రోన్ కెమెరాలను ఉపయోగించారని కేసులు నమోదయ్యాయి.ఈ కేసులో రేవంత్ రెడ్డితో ఆయన అనుచరులు  ఆరుగురిని పోలీసులు ఈ నెల 5వ తేదీన అరెస్ట్ చేశారు. 

అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాను ఉపయోగించిన కేసులో ఏ-1 నిందితుడుగా ఉన్నాడు.   రేవంత్ రెడ్డి అనుచరులకు ఇప్పటికే బెయిల్ మంజూరైంది. కానీ,రేవంత్ రెడ్డికి మాత్రం కోర్టు బెయిల్ ఇవ్వలేదు.

రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్  ను బుధవారం నాడు కోర్టు కొట్టివేసింది.   ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డిని ఈ నెల 5వ తేదీన నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు. 

హైదరాబాదు శివారులోని శంకర్ పల్లి సమీపంలో గల జన్వాడలో ఉన్న ఫాంహౌస్ లోని దృశ్యాలను రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారనే ఆరోపణలను ఎదుర్కుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరాలను ఉపయోగించారని పోలీసులు కేసు నమోదు చేశారు. 

రేవంత్ రెడ్డితో పాటు ప్రవీణ్, విజయసింహ, జైపాల్ రెడ్డి, శివ, ఓంప్రకాశ్ లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరికి రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేటీఆర్ బంధువులకు చెందిన ఫాంహౌస్ ఉన్న ప్రాంతాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా పోలీసులు ప్రకటించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios