జేఏసి చైర్మన్ కోదండరాం ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసిందే. ప్రమాద సమయంలో అందులోనే ఉన్న కోదండరాంతో పాటు మరికొంతమంది కూడా ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బైటపడ్డారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో, అప్పుడు తమ పరిస్థితి ఎలా ఉందో స్వయంగా కోదండరాం తన సన్నిహితులకు వివరించారు. 

బైక్ పై వచ్చిన యువకుల తప్పు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కోదండరాం తెలిపారు.తమ కారు ప్రయాణిస్తున్న దారిలోకి వారు రావడం, తమ డ్రైవర్ వారిని తప్పించబోయి డివైడర్ ను ఢీ కొట్టడం జరిగిందని తెలిపారు. ప్రమాద సమయంలో తనతో పాటు డ్రైవర్ కూడా సీటు బెల్టు పెట్టుకోవడం, బెలూన్లు ఓపెన్ కావడంతో తమకు ఎలాంటి హాని జరగలేదని అన్నారు. ప్రమాదం జరిగిన 10-15 నిమిషాలు  తమకేమి అర్థం కాలేదని, మైండ్ మొత్తం బ్లాంక్ అయ్యిందని తన సన్నిహితులకు వివరించారు కోదండరాం.  

 

ప్రమాదం గురించి కోదండరాం ఏమంటున్నారో కింది వీడియోలో చూడండి