యశోద ఆస్పత్రి లో శవానికి  వైద్యం (వీడియో)

First Published 28, Jan 2018, 1:02 PM IST
dead body treatment at Yashoda Hospital
Highlights
  • మలక్ పేట యశోదా ఆస్పత్రిలో దారుణం
  • వైద్యం పేరుతో పచ్చి మోసం
  • చనిపోయిన శవానికి వైద్యం చేసినట్లు ఆరోపిస్తున్న మృతుడి బందువులు

డబ్బుల కోసం కక్కుర్తిపడి శవానికి వైద్యం చేసే కార్పోరేట్ హాస్పిటల్ నిర్వాకాన్ని మీరంతా ఠాగూర్ సినిమాలో చూసుంటారు. కానీ ఇలా సినిమాల్లోనే జరుగుంది, నిజంగా ఏం జరగదని అనుకున్నారా. అయితే మీరు పొరబడినట్లే. అచ్చం ఆ సినిమాలో మాదిరిగానే శవానికి వైద్యం చేసి లక్షల్లో డబ్బులు దండుకున్న కార్పోరేట్  హాస్పిటల్ బాగోతం హైదరాబాద్ లో బయటపడింది. 

వివరాల్లోకి వెళితే   రాజు అనే యువకుడికి  క్రికెట్ ఆడుతూ బంతి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి తల కి గాయం అవడంతో మలక్ పేట లోని యశోద ఆసుపత్రి లో చేర్చారు.  యువకుడికి బ్రెయిన్ సర్జరీ చేసిన  డాక్టర్లు 10 రోజులు బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పారు. అయితే హఠాత్తుగా ఏమైందో ఏమో గానీ ఇవాళ బాధితుడి కుటుంబసభ్యులు హాస్పిటల్లో ఇప్పటివరకు వైద్యానికైన 7లక్షల బిల్లు చెల్లించిన 10 నిమిషాల్లోనే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.  

అయితే తమ కొడుకు చనిపోయినప్పటికి వైద్యం చేసినట్లు నటించి, డబ్బులు చెల్లించగానే చనిపోయినట్లు చావు కబురు చెప్పారని మృతుడి తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మోసానికి వ్యతిరేకంగా ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగడంతో పాటు, ఆస్పత్రి ఆవరణలోని ఫర్నీచర్ ను ద్వంసం చేశారు.  దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా హాస్పత్రి వద్దకు చేరుకున్న పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.

loader