సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ప్రశాంతమైన నిద్ర నిద్ర పోవాలని భావిస్తారు కానీ కొందరిలో మాత్రం నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలా నిద్రలేమి సమస్యకు కారణాలు ఎన్నో ఉండవచ్చు. ఇలా రాత్రిపూట సరిగా నిద్ర పట్టకపోవడానికి ఉన్నటువంటి కారణాలలో ఉప్పు కూడా ఒకటే.మీరు రోజువారి మొత్తంలో అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యతో బాధపడటం గ్యారెంటీ అని నిపుణులు చెబుతున్నారు.  

సాధారణంగా మనం వంటలలో ఉప్పు ఉపయోగిస్తూ ఉంటాము. ఇలా సరైన మోతాదులో ఉప్పు ఉపయోగించడం వలన వంటలకు సరైన రుచి కలుగుతుంది. ఈ క్రమంలోనే చాలామంది వంటలలో ఉప్పు వాడటమే కాకుండా పైగా వారు ఇతర ఆహార పదార్థాల ద్వారా కూడా ఉప్పును అధికంగా తీసుకుంటున్నారు. ఇలా ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు మనల్ని వెంటాడుతుంటాయి.

మనం రోజువారి ఆహార పదార్థాలలో భాగంగా ఒక రోజుకు 2300 మిల్లీగ్రాముల ఉప్పును తీసుకోవాలి.అంతకన్నా తక్కువగా తీసుకున్న పర్వాలేదు కానీ ఇంతకుమించి అధిక మోతాదులో ఉప్పు తీసుకుంటే నిద్రలేమి సమస్యకు కారణమవుతుంది.ఉప్పు తినడానికి నిద్ర సమస్యకు గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో రక్తపోటు పెరగడమే కాకుండా మన శరీరంలో నుంచి సరైన మోతాదులో నీరు  చెమట రూపంలోనూ లేదా యూరిన్ రూపంలోనూ బయటకు వెళ్ళదు.

ఈ విధంగా ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల అదిక రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది నిద్రలేమి సమస్యకు కారణం అవుతుంది. అయితే చాలామంది రోజువారి ఆహార పదార్థాలతో పాటు ఇతర చిరు తిండి ద్వారా కూడా ఉప్పును తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల ప్రాణానికే ప్రమాదం అని,ఇలా ఉప్పు అధికంగా తీసుకునే వారిలో ఆయుష్షు కూడా తగ్గుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.