కాఫీ జీవక్రియను పెంచి.. ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఒకవేళ మీరు బరువు తగ్గడానికని కాఫీ తాగాలనుకుంటే కాఫీని తాగే ముందు కొన్ని విషయాలను తెలుసుకోవాలి.
ఒక కప్పు కాఫీ మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. రిఫ్రెష్ చేస్తుంది. కాఫీలో కెఫిన్ కంటెంట్ ఉంటుంది. 1 కప్పు కాఫీ మూడ్ ను పెంచుతుంది. బద్ధకం, పని చేయకూడదనే కోరికనూ తగ్గిస్తుంది. అయితే బరువు తగ్గడానికి కూడా కాఫీని కూడా తాగుతుంటారు. కాఫీ జీవక్రియను కూడా పెంచుతుందని కొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అయితే ఎంత కాఫీ తాగాలి? జీవక్రియను ఎలా పెంచుకోవాలో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.
కాఫీలోని పోషకాలు
హార్వర్డ్ హెల్త్ ప్రకారం.. కాఫీలో కెఫిన్, విటమిన్ బి 2 (రిబోఫ్లేవిన్), మెగ్నీషియం, మొక్కల రసాయన క్లోరోజెనిక్ ఆమ్లం, క్వినిక్ ఆమ్లం, కెఫెస్టోల్, కహ్వీల్, డైటరీ డ్రింక్స్ తో సహా పాలీఫెనాల్స్ కూడా ఉంటాయి. 8-ఔన్సుల కప్పు కాఫీలో 95 మి.గ్రా కెఫిన్ కంటెంట్ ఉంటుంది. 3-4 కప్పుల కాఫీని లేదా సగటున 400 మి.గ్రా కెఫిన్ ను ఒక రోజులో తీసుకోవచ్చు. అయితే ఎండాకాలంలో 2-3 కప్పుల కంటే ఎక్కువ కాఫీని తాగకూడదు.
ఫ్యాట్ బర్నింగ్
అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురించబడిన పరిశోధన కెఫిన్ జీవక్రియ రేటును ఎక్కువ లేదా తక్కువ పెంచుతుందని సూచిస్తుంది. ఇది మీరు వ్యాయామం చేసేటప్పుడు, విశ్రాంతి తీసుకునేటప్పుడు శరీరం కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. ఊబకాయుల్లో కాఫీ జీవక్రియ రేటును ప్రేరేపిస్తుంది.
అప్రమత్తతను పెంచుతుంది.
కెఫిన్ జీవక్రియ రేటును 3-11% పెంచుతుంది. కాఫీ ఎక్కువగా తీసుకుంటే దాని ప్రభావం కనిపిస్తుంది. మెటబాలిజం రేటులో పెరుగుదల చాలావరకు కొవ్వు బర్నింగ్ వల్ల వస్తుంది. 50-300 మిల్లీగ్రాముల కెఫిన్ అప్రమత్తతను పెంచుతుంది. ఇది శక్తి స్థాయిలు, ఏకాగ్రత సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఎక్కువ కాఫీని తీసుకోవడం వల్ల ఆందోళన, చంచలత, నిద్రలేమి, హృదయ స్పందన రేటు పెరగడం వంటి సమస్యలు వస్తాయి.
కాఫీని ఎలా తీసుకోవాలి?
బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రకారం.. ఆరోగ్య ప్రయోజనాల కోసం బ్లాక్ కాఫీని తాగాలి. ఒక కప్పు బ్లాక్ కాఫీలో లో కేలరీలు లేదా పిండి పదార్థాలు లేదా కొవ్వు ఉండదు. ఇందులో సోడియం కూడా తక్కువగా ఉంటుంది. బ్లాక్ కాఫీలో సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. ఇది దీర్ఘకాలికంగా అభిజ్ఞా క్షీణత నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇది పాలు లేదా ఇతర పదార్ధాలతో కలిపినప్పుడు తక్కువ ప్రయోజనాలను ఇస్తుంది. ముఖ్యంగా దీనిలో పంచదారను ఎట్టి పరిస్థితిలో కలపకూడదు.
ఖాళీ కడుపుతో కాఫీని తాగకూడదు
న్యూట్రిషన్ జర్నల్ ప్రకారం.. కాఫీని ఎప్పుడూ కూడా ఖాళీ కడుపుతో తాగకూడదు. ఉదయం అల్పాహారం తర్వాత మధ్యాహ్నం 1-5 గంటల మధ్య కాఫీని తాగాలి. ఈ సమయంలో కాఫీ ద్వారా సహజ కార్టిసాల్ పెరుగుతుంది. కాఫీ యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇది మంటను తగ్గిస్తుంది. వ్యాయామానికి ముందు దీన్ని తాగడం వల్ల ఫ్యాట్ బర్నింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. పౌల్ట్రీ, బీన్స్, గింజలు, ఎర్ర మాంసం వంటి జింక్ సోర్స్ ఫుడ్స్ తిన్న తర్వాత కాఫీని అసలే తాగకూడదు. ఇది శరీరం నుంచి జింక్ ను పూర్తిగా తొలగిస్తుంది.
చక్కెరకు బదులు దాల్చిన చెక్క
న్యూట్రిషన్ జర్నల్ ప్రకారం.. కాఫీలో చక్కెరకు బదులుగా దాల్చినచెక్కను ఉపయోగిస్తే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ మసాలా దినుసును కాఫీలో కొద్దిగా వేస్తే మెటబాలిజం ఫాస్ట్ అవుతుంది. ఒక కప్పు కాఫీలో కొద్దిగా దాల్చినచెక్కను జోడించడం వల్ల మీ శరీరం కొవ్వును వేగంగా కరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ లైఫ్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ తాజా అధ్యయనంలో తేలింది.
