Asianet News TeluguAsianet News Telugu

స్టీల్ గ్లాస్ లో మద్యం ఎందుకు తాగరో తెలుసా... స్టీల్ గ్లాసులో తాగితే ప్రాణానికి ప్రమాదమా?

సాధారణంగా మనం బార్లలో లేదా ఎక్కడైనా మద్యం తాగే వాళ్లను కనుక చూస్తే గాజు గ్లాసులో మద్యం తాగడం మనం చూస్తుంటాము లేదా కొన్నిసార్లు ప్లాస్టిక్ గ్లాసులలో కూడా మద్యం తాగుతూ కనిపిస్తుంటారు. ఇలా గాజు లేదా ప్లాస్టిక్ గ్లాసులలో మాత్రమే మద్యం సేవిస్తూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా మీరు స్టీల్  గ్లాసులలో మద్యం తాగే వారిని చూసి ఉండరు. ఇలా స్టీల్ గ్లాసులలో మద్యం తాగకపోవడానికి గల కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా...మరి స్టీల్ గ్లాస్ మద్యం తాగక పోవడానికి గల కారణం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
 

why-people-wont-drink-alcohol-in-steel-glass-know-the-reason gnr
Author
First Published Mar 25, 2023, 3:07 PM IST

సాధారణంగా మనం టీవీలలో చూసిన, బయట ఎక్కడ చూసినా కానీ మద్యం తాగాలి అంటే తప్పనిసరిగా గాజు గ్లాసులు ఉపయోగిస్తారు. ఇక లేదంటే ప్లాస్టిక్ గ్లాసులలో కూడా మద్యం తాగుతూ ఉంటారు.ఇలా వీటిలో మాత్రమే మద్యం తాగడానికి గల కారణం ఏంటి? స్టీలు గ్లాసులలో ఎందుకు తాగరు? స్టీల్ గ్లాసులు తాగితే ఆరోగ్యానికి హానికరమా? ఇలా ఎన్నో సందేహాలు వస్తుంటాయి.అయితే నిజానికి స్టీల్ గ్లాసులో మద్యం తాగటం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే ఈ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీలలో పెద్ద ఎత్తున స్టీల్ పాత్రలలోనే మద్యం తయారు చేస్తారు. అలాగే సుధీర ప్రాంతాలకు మనం దీనిని ట్రాన్స్ పోర్ట్ చేయాలన్న స్టీల్ పాత్రలలోనే తీసుకెళ్తుంటారు. అందుకే స్టీల్ క్లాసులలో మద్యం తాగడం ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి హానికరం కాదనీ అది కేవలం వారి అపోహ మాత్రమేనని చెప్పాలి.ఇక స్టీల్ గ్లాస్ లో ఎందుకు తాగరు అనే విషయానికి వస్తే స్టీల్ గ్లాస్ లో మద్యం తాగడం వల్ల తాగే వారికి ఆల్కహాల్ తాగుతున్న అనుభూతి కలగదట.

అదే గాజు గ్లాసులో మద్యం పోసుకొని తాగడం వల్ల బయటకు మనకు ఆ మద్యం కనబడుతుంది దానిని చూస్తూ తాగడం వల్ల వారు సరికొత్త అనుభూతిని పొందుతారని అందుకే గాజు గ్లాసులోనే మద్యం తాగుతారని తెలుస్తోంది. అలాగే గాజు గ్లాసులో మద్యం తాగడం స్టేటస్ సింబల్ గా కూడా భావిస్తారట. అందుకే చాలామంది మద్యం గాజు గ్లాసులలో తాగడానికి ఇష్టపడతారు. ఇక బయట ఎక్కడైనా తాగేవారు ప్లాస్టిక్ గ్లాసులలో మద్యం తాగుతూ ఉండడం మనం చూస్తుంటాము.

Follow Us:
Download App:
  • android
  • ios