డెంగ్యూ వచ్చిందా..? ఈ ఫుడ్స్ తో ప్లేట్ లెట్ కౌంట్ పెరుగుతుందిలా..!

 కొన్ని ఫుడ్స్ తో వాటిని పెంచుకోవచ్చని మీకు తెలుసా..? ఎలాంటి ఫుడ్స్ తింటే.. తొందరగా ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

why do blood platelets decrease during dengue? expert shared home remedies to improve it ram

ప్రస్తుతం మన దేశంలో డెంగ్యూ విజృంభిస్తోంది. వర్షాకాలం వచ్చింది అంటే.. డెంగ్యూ దోమలు వీరవిహారం చేయడం మొదలుపెడతాయి. వాటి కాటుకు ఎవరైనా బలి కావాల్సిందే. దీంతో.. వరసగా డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ దోమ కుట్టడం వల్ల వెంటనే హై ఫీవర్ వచ్చేస్తుంది. ఆ జ్వరం తగ్గిన తర్వాత నుంచి.. రక్తంలోని ప్లేట్ లెట్ కౌంట్ క్రమంగా పడిపోవడం మొదలుపెడుతుంది. వెంటనే చికిత్స తీసుకొని.. ప్లేట్ లెట్ కౌంట్ పెంచుకోకపోతే... ప్రాణాలు పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. 

కొందరికి వైద్యులు చికిత్స అందిస్తున్నా కూడా ప్లేట్ లెట్ కౌంట్ పడిపోతుంది. ఫలితంగా.. వాటిని ఎక్కించాల్సి వస్తుంది. అయితే... ఇలా ప్టేట్ లెట్స్ ఎక్కించే పనిలేకుండా... కేవలం.. కొన్ని ఫుడ్స్ తో వాటిని పెంచుకోవచ్చని మీకు తెలుసా..? ఎలాంటి ఫుడ్స్ తింటే.. తొందరగా ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

1.ఆకుకూరలు.. డెంగ్యూ వచ్చి తగ్గినవాళ్లు వెంటనే.. ఎక్కువగా ఆకుకూరలు తినాలి. ఎందుకంటే.. వీటిలో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. ఇది.. ప్లేట్ లెట్ కౌంట్ పెరగడానికి ఇవి సహాయపడతాయి. ముఖ్యంగా పాలకూర, బచ్చలకూర వంటివి ఎక్కువగా తినాలి.

2.పాలు..మీకు పాలు తాగే అలవాటు ఉన్నా లేకున్నా...డెంగ్యూ వచ్చిన తర్వాత మాత్రం కచ్చితంగా పాలు తాగాలి. డెంగ్యూ తర్వాత శరీరం చాలా నీరసంగా మారుతుంది. కాల్షియం కూడా తగ్గిపోతుంది. అందుకే.. కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉండే పాలు రోజూ తాగడం వల్ల.. ప్లేట్ లెట్ కౌంట్ పెరగడంతోపాటు.. ఎముకలు బలపడతాయి. శక్తి వస్తుంది.

3.బొప్పాయి ఆకురసం..బొప్పాయి పండు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో.. బొప్పాయి ఆకు రసం తాగితే.. డెంగ్యూ పేషెంట్స్ కి అంత మంచిది. చాలా తక్కువ సమయంలోనే ప్లేట్ లెట్ కౌంట్ పెరగడానికి ఈ ఆకులు ఉపయోగపడతాయి. అలా అని సీసాలకు సీసాలు తాగాల్సిన అవసరం లేదు. ఒక స్పూన్ తాగినా మీకు తేడా చాలా స్పష్టంగా కనపడుతుంది.

4.గుమ్మడికాయ.. గుమ్మడికాయ గింజలు, జ్యూస్ రూపంలో అయినా తీసుకోవచ్చు. వీటిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ప్లేట్ లెట్ కౌంట్ పెంచడానికి సహాయపడుతుంది. గుమ్మడికాయ కాదు అంటే చిలగడదుంప,క్యారెట్ కూడా మీకు ప్లేట్ లెట్ కౌంట్ పెరగడానికి సహాయపడతాయి.

5.అలోవెరా.. అలోవెరా జ్యూస్ తాగినా కూడా మీకు ప్లేట్ లెట్ కౌంట్ పెరగడానికి సహాయపడుతుంది. కలబంద గుజ్జు తిన్నా కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

6.మంచినీళ్లు.. డెంగ్యూ వచ్చిన సమయంలో మన బాడీ వర్షాకాలంలో కూడా డీ హైడ్రేట్ అయిపోతుంది.  అందుకే.. నీరు చాలా ఎక్కువగా తాగాలి.తక్కువలో తక్కువ మూడు లీటర్ల వాటర్ తాగాలి. అప్పుడు బాడీలోని టాక్సిన్స్ బయటకు వెల్లేలా సహాయపడుతుంది. ప్లేట్ లెట్ కౌంట్ పెరగడానికి కూడా సహాయపడుతుంది.

7.లెమన్ జ్యూస్, బీట్ రూట్ జ్యూస్ లు కూడా తాగుతూ ఉండాలి. ఈ రెండు కూడా .. ప్లేట్ లెట్ కౌంట్ చాలా తక్కువ సమయంలోనే తొందరగా పెరగడడానికి సహాయపడతాయి.  అంతేకాదు.. దానిమ్మ గింజలను రెగ్యులర్ గా తినడం వల్ల కూడా ప్లేట్ లెట్ కౌంట్ పెరగడానికి సహాయపడతాయి. రోజుకి ఒక దానిమ్మ కాయ తినాల్సిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios