యూఎస్, యూరప్‌లను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ .. అసలేంటీ జెఎన్ . 1 , శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు

జేఎన్. 1 వేరియంట్ అనే కోవిడ్ రకం యూరప్‌, యూఎస్‌లో తీవ్రంగా వ్యాప్తి చెందుతూ వుండటంతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కలవరం మొదలైంది. లక్సెంబర్గ్‌లో వెలుగుచూసిన ఈ కోవిడ్ జేఎన్ .1 వేరియంట్ ప్రస్తుతం ఇంగ్లాండ్, ఐస్‌లాండ్, ఫ్రాన్స్, అమెరికాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది.

What Is JN.1? The New Covid Variant That Has Sparked Worry Among Scientists ksp

నాలుగేళ్ల క్రితం చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి మనిషిని నాలుగు గోడల మధ్య బందీని చేసింది. గడప దాటాలంటే ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించాల్సిన పరిస్ధితి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కోవిడ్ బారినపడగా అదే స్థాయిలో మరణాలు సంభవించాయి. అయినప్పటికీ మానవాళికి కోవిడ్ ముప్పు మాత్రం తొలగిపోవడం లేదు. కొత్త కొత్త వేరియెంట్ల రూపంలో వైరస్ విరుచుకుపడుతూనే వుంది.

తాజాగా జేఎన్. 1 వేరియంట్ అనే కోవిడ్ రకం యూరప్‌, యూఎస్‌లో తీవ్రంగా వ్యాప్తి చెందుతూ వుండటంతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కలవరం మొదలైంది. లక్సెంబర్గ్‌లో వెలుగుచూసిన ఈ కోవిడ్ జేఎన్ .1 వేరియంట్ ప్రస్తుతం ఇంగ్లాండ్, ఐస్‌లాండ్, ఫ్రాన్స్, అమెరికాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కరోనా వేరియెంట్లతో పోలిస్తే.. ఈ కొత్త కోవిడ్ జేఎన్ .1 వేరియెంట్‌ ప్రమాదకరమైనదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

దీనికి తీవ్రంగా వ్యాప్తి చెందే గుణంతో పాటు వ్యాక్సిన్ మనిషికి అందించే రోగ నిరోధక శక్తిని కూడా తట్టుకుంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం.. జేఎన్ రకం వైరస్ ఇటీవల అమెరికా సహా 11 దేశాల్లో గుర్తించారు. ఈ వేరియెంట్ ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధుల పెరుగుదలకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. 

నిపుణులు చెబుతున్న దానిని బట్టి.. ఈ కొత్త వేరియెంట్ బీఏ.2.86 వారసుడు. దీనిని పిరోలా అని కూడా పిలుస్తారు. ఇది ఒమిక్రాన్ నుంచి పుట్టినట్లుగా చెప్పారు. అమెరికాలో జేఎన్ .1 , బీఏ.2.86  సాధారణంగా కనిపించేది కాదు.. వాస్తవానికి జేఎన్.1 చాలా అరుదుగా కనుగొనబడింది. ఇది సార్స్ కోవ్ 2 వైరస్‌లలో 0.1 శాతం కంటే తక్కువగా వుంటుందని సీడీసీ నివేదించింది. జేఎన్ , బీఏ.2.86 మధ్య ఒకే ఒక్క మార్పు వుంది. అది కూడా స్పైక్ ప్రోటీన్‌లో కావడం గమనార్హం. వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి ఈ ప్రోటీనే కారణమని సీడీసీ వివరించింది. 

అమెరికాలో ప్రస్తుతం వ్యాపిస్తున్న అన్ని వైరస్‌లు ఎక్స్‌బీబీ కుటుంబంలో భాగమేనని .. కోవిడ్ వ్యాక్సిన్‌లు బీఏ.2.86 నుంచి రక్షిస్తాయని సీడీసీ తెలిపింది. జేఎన్.1కి వ్యతిరేకంగా అదే ప్రభావాన్ని ఆశించవచ్చని పేర్కొంది. ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన సార్స్ కోవ్ 1 ఇంటరాజెన్సీ గ్రూప్ నుంచి వచ్చిన విశ్లేషణలు కూడా చికిత్సలు, పరీక్ష ప్రభావవంతంగా వుంటుందని సూచించాయని సీడీసీ వెల్లడించింది. కోవిడ్ 19 ఈ భూమిపై వున్నంత వరకు కొత్త వేరియెంట్‌లు పుట్టుకొస్తూనే వుంటాయని పేర్కొంది. సీడీసీతో పాటు ఇతర ఏజెన్సీలు టీకాలు, పరీక్షలు, చికిత్సలపై కొత్త వేరియెంట్‌ల ప్రభావాలను పర్యవేక్షిస్తాయని చెప్పింది. అయితే చాలా వరకు కొత్త వేరియెంట్లు ప్రజలకు ప్రాణాంతకం కలిగించేవి కావని సీడీసీ స్పష్టం చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios