దగ్గు ఉన్నప్పుడు ఏం తినకూడదో తెలుసా?

వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా దగ్గు అంత తొందరగా తగ్గదు. దీనికి తోడు లేనిపోనివి తింటూ దగ్గు తగ్గకుండా చేసుకుంటారు. అసలు దగ్గు సమస్య ఉన్నప్పుడు ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

 What food should be avoided during a cough rsl

వర్షాకాలంలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఒక్కోసారి మందులతో జ్వరం తగ్గినా.. దగ్గు మాత్రం అంత తొందరగా నయం కాదు. దీనికి మీరు తినే ఆహారాలే కారణమంటున్నారు నిపుణులు. ఎందుకంటే దగ్గు సమస్య ఉన్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలను తింటే దగ్గు మరింత పెరుగుతుంది. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి. 

పాలు:  దగ్గు సమస్య ఉన్నప్పుడు పాలను అస్సలు తాగకూడదంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఈ సమయంలో పాలను తాగితే దగ్గు, కఫం సమస్యలు మరింత పెరుగుతాయి. దగ్గు ఉన్నప్పుడు ఒక్క పాలే కాదు.. పాల ఉత్పత్తులను కూడా తీసుకోకూడదు. ఇవి మీ సమస్యను మరింత పెంచుతాయి. 

అన్నం: చాలా మందికి అన్నం తింటేనే కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. కానీ దగ్గు ఉన్నప్పుడు అన్నం తినకూడదంటారు నిపుణులు. ఎందుకంటే బియ్యం చలువ స్వభావాన్ని కలిగి ఉంటాయి. దీనివల్ల మీ దగ్గు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దగ్గు సమస్య ఉన్నప్పుడు మీరు రాత్రిపూట అన్నాన్ని తినకూడదు. 

చక్కెర: దగ్గు సమస్య ఉన్నప్పుడు మీరు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా చక్కెరను ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే చక్కెర మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అలాగే ఉన్న దగ్గును మరింత పెంచుతుంది. అందుకే దగ్గు ఉన్నప్పుడు తీపి తినకూడదంటారు. 

వేయించిన ఆహారాలు : దగ్గు సమస్య ఉంటే మీరు వేయించిన ఆహారాలను తినడం మానుకోవాలి. ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ వంటి వేయించిన ఆహార పదార్థాలను తింటే మీకున్న దగ్గు మరింత పెరుగుతుంది. 

ఆల్కహాల్ :ఆరోగ్యం ఎలా ఉన్నా.. కొంతమంది రెగ్యులర్ గా ఆల్కహాల్ ను తాగుతుంటారు. కానీ దగ్గు ఉన్నప్పుడు మాత్రం మందును పొరపాటున కూడా తాగకూడదు. ఎందుకంటే ఇది మీ దగ్గును మరింత పెంచడమే కాకుండా.. మీ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. 

దగ్గు తగ్గాలంటే ఏం చేయాలి? 

దగ్గు నుంచి ఉపశమనం పొందాలంటే మీరు.. దాల్చిన చెక్క, పచ్చి వెల్లుల్లి, లవంగాలు మొదలైనవి తీసుకోవాలి. ఎందుకంటే ఇవి మీ గొంతును దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇది కాకుండా తులసి టీ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios