శరీరంలో రక్తం తగ్గడం వల్ల విపరీతమైన అలసట, శక్తిలేనట్టుగా అనిపించడం, ఏ పని చేయాలనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు మైకంగా కూడా అనిపిస్తుంది. అయితే కొన్ని కూరగాయలు శరీరంలో రక్తాన్ని పెంచడానికి బాగా సహాయపడతాయి. 

మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గడం, ఎర్ర రక్తకణాల సంఖ్య బాగా పడిపోవడం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. రక్తహీనత వల్ల అలసట, శక్తి లేకపోవడంం, మైకము, ఏ పని చేతకాకపోవడం, శక్తి లేనట్టుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తాన్ని పెంచడానికి ఐరన్ బాగా సహాయపడుతుంది. అందుకే శరీరంలో రక్తం పెరగడానికి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. అయితే కొన్ని కూరగాయలను తింటే హిమోగ్లోబిన్, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి. ఇందుకోసం ఏయే కూరగాయలను తినాలంటే..? 

బచ్చలికూర

బచ్చలికూర మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. బచ్చలికూరలలో ఐరన్, విటమిన్ కె, విటమిన్ బి, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. ఈ కూరలలో విటమిన్ సి కూడా మంచి మొత్తంలో ఉంటుంది. ఇది మన శరీరంలో ఇనుము శోషణను పెంచుతుంది. విటమిన్లు సమృద్ధిగా ఉండే బచ్చలికూర మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కండరాలను కూడా హెల్తీ గా ఉంచుతుంది. బచ్చలికూరను తరచుగా తింటే రక్తం పెరుగుతుంది. 

బీట్ రూట్

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం నుంచి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడం వరకు బీట్ రూట్ మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. బీట్ రూట్ లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ లో ఐరన్, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు బాగా పెరుగుతాయి.

మునగ ఆకులు 

ముగన ఆకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అవును ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గించడమే కాదు మరెన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. ఈ ఆకులను మీ రోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. అంతేకాదు ఈ ఆకులు రక్తహీనత సమస్యలను కూడా పోగొడుతాయి. ఈ ఆకులు మీ శరీరం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

బొప్పాయి

బొప్పాయితో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. బొప్పాయి మన శరీరానికి, చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండులో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు దీనిలో విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం, జింక్, మాంగనీస్ , ఫాస్పరస్, ఫైబర్, కాల్షియం లు కూడా పుష్కలంగా ఉంటాయి. బొప్పాయిని రెగ్యులర్ గా తింటే మీ శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది. ఆరోగ్యంగా కూడా ఉంటారు.