ఇవే గర్భందాల్చే అవకాశాలను తగ్గిస్తాయి..!
ఈ రోజుల్లో చాలా మంది సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్నారు. ఆడవాళ్లు, మగవాళ్లు అంటూ తేడా లేకుండా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు. నిజానికి దీనికంతటికి ప్రధాన కారణం మన అలవాట్లేనంటున్నారు నిపుణులు.

మన వయస్సు కూడా పునరుత్పత్తి వ్యవస్థలో ఎన్నో మార్పులకు దారితీస్తుంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ తాజా అధ్యయనం ప్రకారం.. వంధ్యత్వం ప్రపంచవ్యాప్తంగా 186 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తోంది. ఎందుకంటే 35 సంవత్సరాల తర్వాత సంతానోత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది. అండోత్సర్గములో సమస్యలు, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, లూపస్, గర్భాశయ సమస్యలు వంటి స్వయం ప్రతిరక్షక వ్యాధులు మహిళల్లో వంధ్యత్వానికి కారణమవుతున్నాయి. పురుషులలో తక్కువ స్థాయిలో టెస్టోస్టెరాన్, తక్కువ స్పెర్మ్ కౌంట్, సల్ఫాసలాజైన్ వంటి కొన్ని ఓవర్ ది కౌంటర్ మందులు వంధ్యత్వానికి దారితీస్తాయి. సంతానోత్పత్తిని ప్రభావితం చేసే కొన్ని అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ధూమపానం
ధూమపానం మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుంది. ఇది సంతానోత్పత్తిపై కూడా ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. ధూమపానం చేసే మహిళలకు అండాశయ నిల్వలు తక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. ఇది ఫలదీకరణానికి తక్కువ అండాలను అందుబాటులో ఉంచుతుంది. అంతేకాదు ధూమపానం గైనకాలజికల్ వ్యవస్థకు రక్త సరఫరాను తగ్గిస్తుంది. ఇది గుడ్ల నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది.
ఆల్కహాల్ వినియోగం
అతిగా ముందు తాగే పురుషులు, మహిళలు ఇద్దరూ సంతానోత్పత్తి సమస్యలను ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇది మహిళల రుతుచక్రాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఎర్రెగ్యులర్ పీరియడ్స్ కు దారితీస్తుంది. ఇది గర్భందాల్చే అవకాశాలను తగ్గిస్తుంది. ఇకపోతే ఆల్కహాల్ పురుషుల స్పెర్మ్ నాణ్యత, పరిమాణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది గర్భధారణ అవకాశాన్ని తగ్గిస్తుంది.
పేలవమైన ఆహారం
పునరుత్పత్తి ఆరోగ్యంతో సహా మన మొత్తం ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. పోషకాలు తక్కువగా, ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే సంతానోత్పత్తి సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇలాంటి ఫుడ్ హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. అలాగే రుతుచక్రానికి అంతరాయం కలిగిస్తుంది. అలాగే గుడ్లు, స్పెర్మ్ నాణ్యతను తగ్గిస్తుంది.
వ్యాయామం లేకపోవడం
బరువు పెరగకుండా ఉండేందుకు, శరీరం ఫిట్ గా ఉండేందుకు వ్యాయామం ఎంతో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన బరువు సంతానోత్పత్తి అవకాశాలను పెంచుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మీ బరువు అదుపులో ఉంటుంది. అధిక బరువు లేదా ఊబకాయం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో గర్భందాల్చే అవకాశాలు తగ్గుతాయి. వ్యాయామం పునరుత్పత్తి అవయవాలకు రక్త ప్రవాహాన్ని కూడా పెంచుతుంది. ఇది సంతానోత్పత్తికి చాలా అవసరం.
ఒత్తిడి
దీర్ఘకాలిక ఒత్తిడి హార్మోన్ల సమతుల్యతకు దారితీస్తుంది. ఇది సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు అండోత్సర్గానికి ఆటంకం కలిగిస్తుంది. స్పెర్మ్ సంఖ్య, నాణ్యత రెండింటినీ తగ్గిస్తుంది. వ్యాయామం, యోగా, ఇతర ఒత్తిడి తగ్గించే పద్ధతులు సంతానోత్పత్తిని పెంచుతాయి.