బొప్పాయి అందానికి, ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుందన్న ముచ్చట అందరికీ  తెలుసు. కానీ వీటి విత్తనాలను మాత్రం అక్కరకు రావని పారేస్తుంటారు. కానీ ఈ విత్తనాల్లో ఎన్నో ఔషదగుణాలున్నాయి తెలుసా? అవును వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. 

Health Tips: ఆరోగ్యకరమైన పండ్లలో బొప్పాయి ఒకటి. బొప్పాయి మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు.. చర్మం, జుట్టుకు కూడా ఇది మంచి మేలు చేస్తుంది. అందుకే ఈ పండును తరచుగా తినే వారు చాలా మందే ఉన్నారు. ఇదంతా బానే ఉన్నా.. బొప్పాయి గుజ్జును మాత్రమే తినేసి వాటి విత్తనాలను పారేస్తుంటారు. అవి ఎందుకూ అక్కరకు రావని. కానీ ఇవి మనకు ఎన్నో విధాలా మేలు చేస్తాయి. 

బొప్పాయి విత్తనాల్లోల ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే జింక్, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, కాల్షియంతో సహా విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. ఈ బొప్పాయి విత్తనాలలో ఒలేయిక్ ఆమ్లం, పాలీఫెనాల్స్ వంటి మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు అయిన ఫ్లేవనాయిడ్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పోషక విలువలన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు ఎన్నో వ్యాధులను నయం చేస్తాయి. బొప్పాయి గింజలు మనకు ఏవిధంగా ఉపయోగపడతాయంటే..

బరువు తగ్గడానికి సహాయపడతాయి

బొప్పాయి గింజల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. ఇది మీ శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఈ గింజలు మీ జీవక్రియను కూడా నియంత్రించడానికి సహాయపడతాయి. మీ శరీరం అదనపు కొవ్వును నిల్వ చేయకుండా కాపాడుతుంది. ఊబకాయం బారిన పడకుండా ఉండేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. 

గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

బొప్పాయి విత్తనాలలో కార్పైన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది ప్రేగులలోని పురుగులు, బ్యాక్టీరియాను చంపుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుం. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ విత్తనాల్లో ఉండే ఫైబర్ కంటెంట్ ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. 

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది

ఫైబర్ కంటెంట్ శరీరమంతా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. బొప్పాయి గింజలు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ సాధారణ స్థాయిలో ఉంటుంది. వీటిలో ఒలేయిక్ ఆమ్లం, ఇతర మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కొవ్వు ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. 

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

బొప్పాయి విత్తనాలలో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి బలమైన యాంటీఆక్సిడెంట్లు. ఇవి శరీరాన్ని అనేక రకాల క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి. ఇందుకోసం 5 నుంచి 6 బొప్పాయి విత్తనాలను తీసుకొని వాటిని గ్రైండ్ చేసి ఆహారం లేదా రసంలో కలిపి తీసుకోండి. 

మంటను తగ్గిస్తుంది

బొప్పాయి విత్తనాలలో విటమిన్ సి, ఆల్కలాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ వంటి ఇతర సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి గౌట్, ఆర్థరైటిస్ వంటి సమస్యల మంటను నివారించడానికి, తగ్గించడానికి సహాయపడతాయి.

పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తుంది

బొప్పాయిలో ఉండే కెరోటిన్ ఈస్ట్రోజెన్ లాంటి హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించడానికి శరీరానికి సహాయపడుతుంది. బొప్పాయి విత్తనాలు రుతుస్రావాన్ని ప్రేరేపించడానికి, రెగ్యులర్ గా కావడానికి సహాయపడతాయి. అవి పీరియడ్ నొప్పిని కొంతవరకు తగ్గిస్తాయి కూడా.