గర్భిణులు ఒత్తిడికి గురైతే తల్లితో పాటుగా బిడ్డకు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇది మీ బిడ్డను మానసికంగా వీక్ చేస్తుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవారి శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పులు శారీరకంగానే కాదు, భావోద్వేగ, మానసికమైనవి కూడా. ఇది ఒత్తిడికి దారితీస్తుంది. ఒత్తిడి కాబోయే తల్లులను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. గర్భధారణ సమయంలో ఒత్తిడిని ఎలా తగ్గించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
గర్భధారణ సమయంలో ఒత్తిడి ఎన్నో సమస్యలను కలిగిస్తుంది. గర్భిణులు ఒత్తిడి వల్ల నిద్రలో ఇబ్బంది, శారీరక నొప్పులు వంటి సమస్యలను ఫేస్ చేస్తారు. అలాగే నిరాశ, బరువు పెరగడం లేదా తగ్గడం,అధిక రక్తపోటు వంటి సమస్యలు మరింత ఎక్కువవుతాయి.
శ్వాసపై శ్రద్ధ పెట్టండి
ఒత్తిడి వల్ల శ్వాస విధానాలు గణనీయంగా ప్రభావితమవుతాయి. అంటే దీనివల్ల శ్వాసను తక్కువగా పీల్చుకుంటారు. ఇది మీ శరీరంలో ఆక్సిజన్ మొత్తాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల మీ శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. దీంతో మీ ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి. ధ్యానం చేయడం, మీ శ్వాసపై శ్రద్ధ పెట్టడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. గర్భధారణ సమయంలో సరిగ్గా శ్వాస తీసుకోవడానికి కూర్చోండి లేదా పడుకోండి, మీ కళ్లను మూసుకోండి. మీకు ఆందోళనగా అనిపించినపుడల్లా కనీసం ఐదు లోతైన శ్వాస తీసుకోండి.
నిద్ర
మీకు తగినంత నిద్ర లేనప్పుడు మీ శరీరం, మనస్సు రెండూ త్వరగా శక్తిని కోల్పోతాయి. ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఇది ప్రతికూల భావాలకు, ఆలోచనలకు దారితీస్తుంది. రాత్రిపూట నిద్రపోవడానికి ఇబ్బంది ఉంటే పగటిపూట కొంతసేపైనా నిద్రపోవడానికి ప్రయత్నించండి.
శరీరాన్ని సాగదీయండి
ఒత్తిడి సమయంలో విడుదలయ్యే హార్మోన్ల ఫలితంగా మీ కండరాలు ఉద్రిక్తంగా, సంకోచిస్తాయి. గర్భధారణ సమయంలో ఈ సమస్యను ఎదుర్కోవటానికి, ఉద్రిక్తతను తగ్గించడానికి శరీరాన్ని అద్భుతమైన టెక్నిక్.
మీరు ఉద్రిక్తంగా లేదా ఆందోళన చెందుతున్నట్టు అనిపిస్తే మీ మెడ, వీపు, చేతులు, కాళ్లను సాగదీస్తూ కొన్ని నిమిషాలు గడవండి. మీ ఎడమ చెవి మీ ఎడమ భుజానికి దగ్గరగా ఉండేలా మీ తలను తిప్పండి. అలాగే మీ మెడను సాగదీయండి. ఈ భంగిమలో 20 సెకన్ల పాటు ఉండండి.
పిప్పరమింట్ టీ తాగండి
పిప్పరమింట్ ఆకులలో కనిపించే మెంతోల్ అనే పదార్ధం ఉంటుంది. ఇది కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. దీన్నితాగితే ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది. పుదీనా ఉబ్బరం, వికారం, వాంతులు వంటి జీర్ణశయాంతర సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీరు ఎక్కడ ఉన్నా ఒత్తిడి, కడుపు సమస్యలను తగ్గించడానికి పుదీనా ఎంతో సహాయపడతాయి.
