వానాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యకు దూరంగా ఉండొచ్చు. అలాగే ఈ సీజన్ లో మీరు ఆరోగ్యంగా ఉంటారు.  

వర్షాకాలం మొదలైంది. ఇప్పటి నుంచి వానలు పడుతూనే ఉంటాయి. దీంతో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. గాలి తాజాగా ఉంటుంది. కానీ వర్షాకాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిలో ఒకటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు. ఫంగల్ ఇన్ఫెక్షన్లు చికాకు కలిగిస్తాయి. అసౌకర్యంగా ఉంటాయి. వీటిని వదిలించుకోవడం చాలా కష్టం. వానాకాలంలోఆరోగ్యంగా ఉండటానికి వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి ముందుగా చేయాల్సిన పని క్రమం తప్పకుండా స్నానం చేయడం, మీ చేతులను తరచుగా కడుక్కోవడం చేయాలి. అలాగే ప్రతిరోజూ బట్టలను మార్చుతూ ఉండాలి. అలాగే మీ పాదాలను శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. మీ పాదాలకు గాలి తగిలేటట్టుగా, ఆరడానికి క్లోజ్డ్-టోన్ షూలకు బదులుగా చెప్పులు లేదా ఓపెన్-టోన్ బూట్లను వేసుకోవాలి. అంతేకాదు మీ గోర్లను చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మీ గోర్ల కింద, చుట్టూ బ్యాక్టీరియా, శిలీంధ్రాలు పెరుగుతాయి. 

వానాకాలంలో టైట్ గా ఉండే బట్టలను వేసుకోకూడదు. ఎందుకంటే ఇది మీ శరీరంపై తేమ, వేడిని ట్రాప్ చేస్తుంది. దీంతో అక్కడ శిలీంధ్రాలు పెరుగుతాయి. అందుకే ఈ సీజన్ లో వదులుగా ఉండే కాటన్ బట్టలను వేసుకోండి. దీంతో మీ చర్మం పొడిగా, చల్లగా ఉంటుంది. అలాగే స్పాండెక్స్ లేదా నైలాన్ వంటి సింథటిక్ బట్టలను వేసుకోకండి. ఎందుకంటే ఈ బట్టలు గాలిని అడ్డుకుంటాయి. అలాగే మీ శరీరంపై వేడి, తేమను ట్రాప్ చేస్తాయి.

ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండటానికి పొడిగా ఉండే వాతావరణంలో ఉండాలి. వానాకాలంలో ఎక్కువ వర్షం పడే ప్రాంతంలో నివసిస్తుంటే మీ ఇల్లు నీటితో నిండిపోకుండా లేదా తేమగా మారకుండా చూసుకోవాలి. గాలిలో తేమను తగ్గించడానికి, శిలీంధ్రాలు పెరుగకుండా ఉండేందుకు మీ ఇంట్లోకి బాగా వెలుతురు వచ్చేలా చూడాలి. అలాగే గాలిలో అదనపు తేమను తగ్గించడానికి అవసరమైతే డీహ్యుమిడిఫైయర్ ఉపయోగించాలి. 

టవల్స్ లేదా బట్టలు వంటి వ్యక్తిగత వస్తువులను ఇతరులతో షేర్ చేసుకోకూడదు. ముఖ్యంగా వారికి ఇప్పటికే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే. వస్తువులను షేర్ చేసుకుంటే వ్యక్తి నుంచి మరొకవ్యక్తికి సంక్రమణ వ్యాప్తి చెందుతుంది. వీటిని వదిలించుకోవడం చాలా కష్టం కూడా. అలాగే లాకర్ గదులు లేదా పబ్లిక్ పూల్స్ వంటి బహిరంగ ప్రదేశాలలో చెప్పులు లేకుండా నడవకండి. ఎందుకంటే ఈ ప్లేస్ లో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇవి శిలీంధ్రాలకు సంతానోత్పత్తి కేంద్రాలు కావొచ్చు.

వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తే ఓవర్ ది కౌంటర్ యాంటీ ఫంగల్ క్రీములు లేదా స్ప్రేలను ఉపయోగించండి. కానీ మీకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకిందని అనుమానం వస్తే ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లండి.