మన జీవితాన్ని ఎంతో సంతోషంగా ఆస్వాదించాలి అంటే రుచి వాసన అనేది తప్పనిసరిగా మనం పసిగట్టగలిగినప్పుడే జీవితాన్ని ఎంతో సంతోషంగా ఆస్వాదించవచ్చు. అయితే కొన్నిసార్లు మనం ఈ రుచి వాసనను పూర్తిగా పసిగట్ట లేకపోతాము. ఇలా రంగు వాసనను గుర్తించడం కోల్పోతే మనం కొన్ని రకాల వ్యాధులకు గురైనట్టేనని అర్థం. ఇలా రుచి వాసనను గుర్తించడం వయసు పైబడే కొద్ది కోల్పోతూ ఉంటాము. అయితే ఇలా మనం ఎప్పుడైతే రుచి వాసనను గుర్తించలేమో అప్పుడు మనం ఈ వ్యాధుల బారిన పడినట్లేనని అర్థం. 

మనం ఎప్పుడైతే రుచి వాసనను కోల్పోతామో అప్పుడు మనం తీసుకునే ఆహారం ఎలాంటి రుచి తెలియక ఏదో చడి చప్పడిగా తిన్నట్లు ఉంటుంది. అందమైన పుష్పాలు వికసించిన వాటి పరమలాన్ని ఆస్వాదించలేక ఎంతో బాధపడుతూ ఉంటాము.రుచి వాసన రెండు కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి కనుక ఒకేసారి మనం ఈ రుచి వాసనను కోల్పోతుంటాము అయితే ఇది వయసు పై భడే కొద్దీ కొందరిలో రుచిని వాసనను గ్రహించే శక్తి కూడా కోల్పోతూ ఉంటారు.

ఇక కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు మనకు సోకినప్పుడు మనం రుచిని గుర్తించడం వాసనను గుర్తించలేకపోతాము. అయితే కోవిడ్ 19 వైరస్ మనకు సోకినప్పుడు రుచి వాసన తెలియకపోవడం ఈ కోవిడ్ లక్షణముగా భావించారు. అలాగే జలుబు సమస్యతో బాధపడే వారు కూడా ఈ రుచి వాసనను గుర్తించలేరు. ఇక కొందరు క్యాన్సర్ బారిన పడి రేడియేషన్, తెరపి వంటి చికిత్స తీసుకుంటున్న సమయంలో కూడా వారు రుచిని వాసనను గ్రహించే స్థాయిని కోల్పోతారు. అయితే చికిత్స మానేసిన తర్వాత తిరిగి వాళ్లు రుచిని వాసనను గ్రహించగలుగుతారు.

ఇక మరికొందరిలో నోటిలో చిగుళ్ల ఇన్ఫెక్షన్ కారణంగా కూడా వారు తీసుకుంటున్న ఆహార పదార్థాల రుచి వాసనను కూడా గ్రహించలేరు అయితే ఇలా తరచూ రుచి వాసన కోల్పోతూ ఉన్నట్లయితే కొన్ని రకాల వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పాలి. ఉదాహరణకు ఆల్జీమర్స్ పార్కిన్సన్స్ వంటి వ్యాధి లక్షణాలు కూడా రంగు వాసనను గుర్తించలేకపోవడమే ఇలా మీరు తరచూ రంగు వాసనను కనక గుర్తించలేకపోతే వెంటనే వైద్యుని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఎంతో ఉత్తమం.