Asianet News TeluguAsianet News Telugu

ఈ వ్యాధులు ఆడవాళ్ల కంటే మగవారికే ఎక్కువొస్తయ్..

వ్యాధులు వీళ్లకే వస్తాయి? వీళ్లకు అసలే రావు  అని ఉండదు. లింగభేదం లేకుండా వ్యాధులు ప్రతి ఒక్కరినీ ప్రభావితంచేస్తాయి. కానీ కొన్ని రకాల వ్యాధులు మాత్రం ఆడవారి కంటే మగవారికే ఎక్కువగా వస్తాయి. అవేంటంటే? 
 

these most common types of diseases affect men more than women rsl
Author
First Published Dec 15, 2023, 4:45 PM IST

ఆరోగ్యం పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. మనం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కొన్ని వ్యాధులు మనల్ని జీవితాంతం బాధిస్తూనే ఉంటాయి. అందుకే మన శరీరంలో కనిపించే చిన్నచిన్న వ్యాధుల లక్షణాలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఈ లక్షణాలు మన శరీరంలోని అంతర్గత అవయవాల్లో ఏదో సరిగా లేదని సూచిస్తాయి. అయితే ఈ ఆర్టికల్ లో మనం ఆడవారి కంటే పురుషులకే ఎక్కువగా వచ్చే వ్యాధులేంటో తెలుసుకుందాం పదండి. 

క్యాన్సర్

మహిళల కంటే పురుషులకే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ పురుషులకు ఎక్కువగా వస్తుంది. అయితే వీటి లక్షణాలను మొదట్లోనే గుర్తిస్తే.. దీన్ని తగ్గించుకోవచ్చు. 

టైప్ 2 డయాబెటిస్

వయస్సు, లింగం అంటూ తేడా లేకుండా డయాబెటీస్ ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. చిన్న పిల్లలను కూడా ఈ వ్యాధి వదలడం లేదు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. మహిళల కంటే పురుషులకే డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్.

కిడ్నీ సమస్యలు

పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల మూత్రపిండాల సమస్యలు వస్తాయి. అయితే కొన్ని అధ్యయనాల నివేదికల ప్రకారం.. ఆడవారితో పోలిస్తే మగవారికే ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. 

కాలేయ సమస్యలు

మహిళల కంటే పురుషులే ఆల్కహాల్ ను ఎక్కువగా తాగుతారు. అందుకే వీళ్లు కాలేయ సంబంధిత సమస్యల బారిన ఎక్కువగా పడతారు. 

ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్

ఆడవారితో పోలిస్తే పురుషులకే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ వచ్చే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

వైరల్ ఫీవర్

మహిళల కంటే పురుషులకే వైరల్ ఫీవర్ వచ్చే అవకాశం ఎక్కువ అని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పురుషుల్లో కనిపించే ఈస్ట్రోజెన్ హార్మోనే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios