Asianet News TeluguAsianet News Telugu

కళ్లు పచ్చగా, చర్మం పై దురద పెడితే ఆ క్యాన్సర్ ఉన్నట్టేనా..!

ప్రస్తుతం ప్రాణాంతక రోగాలు సైతం కామన్ వ్యాధులుగా మారిపోయాయి. అందులో క్యాన్సర్ ఒకటి. అవును ప్రస్తుతం చాలా మంది క్యాన్సర్ తో బాధపడుతున్నారు. క్యాన్సర్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. 
 

 symptoms of liver cancer rsl
Author
First Published May 25, 2023, 2:57 PM IST

చాలా క్యాన్సర్లను స్టార్టింగ్ లోనే గుర్తిస్తే వీటిని పూర్తిగా నయం చేసుకుని ప్రాణాలతో బయటపడొచ్చు. నిజానికి క్యాన్సర్ మన శరీరంలోని ఏ భాగాన్నైనా ప్రభావితం చేయొచ్చు. క్యాన్సర్లలో కాలేయ క్యాన్సర్ ఒకటి.  ఇది కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. కాలేయ క్యాన్సర్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆల్కహాల్, స్మోకింగ్ ఎక్కువగా తీసుకోవడం, కామెర్లు, ఇతర కాలేయ వ్యాధులు, ఊబకాయం, మధుమేహం, కొన్ని రకాల మందులు కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి కాలెయ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

అలసట: విపరీతమైన అలసట కాలెయ క్యాన్సర్ కు లక్షణమంటున్నారు నిపుణులు. అలసట, ఏమీ చేయలేకపోవడం ఎన్నో వ్యాధులకు సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు, కానీ కాలేయ క్యాన్సర్ కూడా ఇలాంటి లక్షణాల్ని చూపిస్తుంది. 

అకస్మత్తుగా బరువు తగ్గడం: కొంతమంది కారణం లేకుండా అకస్మాత్తుగా బరువు తగ్గుతుంటారు. అకస్మాత్తుగా బరువు తగ్గడం కాలేయ వ్యాధితో సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

వాంతులు: అడపాదడపా వాంతులు కూడా కాలెయ  క్యాన్సర్ మరొక లక్షణం. ఈ క్యాన్సర్ బారిన పడితే ఏ ఆహారం తిన్నా, తినకపోయినా.. అప్పుడప్పుడు వాంతులు అవుతుంటాయి. 

కళ్లు పసుపు రంగులోకి మారడం: శరీరం, కళ్లు పసుపు రంగులో మారడం అస్సలు మంచిది కాదు. దీనికి తోడు కారణం లేకుండా చర్మం దురద పెడితే కూడా జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే ఇవన్నీ కాలెయ క్యాన్సర్ లక్షణాలే కావొచ్చు. 

పొత్తికడుపు నొప్పి: పొత్తికడుపు నొప్పికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఎలాంటి కారణం లేకుండా పొత్తికడుపు కింది భాగంలో నొప్పి రావడం కాలెయ క్యాన్సర్ లక్షణమేనంటున్నారు నిపుణులు. 

కడుపు నిండినట్టుగా అనిపించడం: మీరు కొంచెమే తిన్నా కడుపు నిండినట్టుగా అనిపిస్తుందా? అయితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇది కాలేయ క్యాన్సర్ తో ముడిపడి ఉంది. అంతేకాదు దీనివల్ల తినడానికి ముందే నొప్పి వస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios