కలుషితమైన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులపై చెడు ప్రభావం పడుతుంది. అంతేకాదు మెదడు, మూత్రపిండాలు, కాలెయాలకు సంబంధించి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.  

వాయు కాలుష్యం అనేక వ్యాధులకు కారణమవుతుంది. ముఖ్యంగా ఇది మెదడు, మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవాలను బాగా దెబ్బతీస్తుంది. మోటారు వాహనాలు, ఫ్యాక్టరీలు, కార్చిచ్చులు వాయు కాలుష్యానికి సాధారణ కారణాలు. వాయు కాలుష్యం వల్ల మన ఊపిరితిత్తులకు ఇంకా ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. కలుషితమైన గాలిని ప్రతిరోజూ పీల్చడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. అంతేకాదు ఇది మెదడు, మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవాలను దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడేస్తుంది. వ్యర్థాల నుంచి ఊపిరితిత్తులను శుభ్రపరచడానికి, వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కొన్ని చిట్కాలు బాగా సహాయపడతాయి. అవేంటంటే.. 

ఏరోబిక్ వ్యాయామాలు

క్రమం తప్పకుండా ఏరోబిక్ వ్యాయామాలను చేయడం వల్ల మీ ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుంది. ఏరోబిక్ వ్యాయామాలలో రన్నింగ్, నడక, సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్, బాక్సింగ్, టెన్నిస్ వంటి ఆటలు ఉంటాయి. ఇవి ఇతర అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. 

విటమిన్ డి

విటమిన్ డి ని మీరోజు వారి ఆహారంలో చేర్చుకుంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో విటమిన్ డి స్థాయిలను పెంచడం వల్ల కార్టికోస్టెరాయిడ్ చికిత్స అవసరమయ్యే ఉబ్బసం నుంచి తప్పించుకోవచ్చని ది లాన్సెట్ నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడించింది. విటమిన్ డి సాధారణంగా సాల్మన్ చేపలు, గుడ్లు, సార్డినెస్ వంటి జంతు ఉత్పత్తులలో లభిస్తుంది. సూర్యరశ్మి ద్వారా కూడా విటమిన్ డిని పొందొచ్చు.

శ్వాస వ్యాయామాలు 

శ్వాస వ్యాయామాలు కూడా ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. ప్రతిరోజూ శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది. రోజుకు 30 సార్లు లోతైన శ్వాస తీసుకోవడం వదలడం వల్ల అధిక రక్తపోటును కంట్రోల్ లో ఉంటుంది. ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. 

హెల్తీ ఫుడ్స్ 

ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి, ఆరోగ్యకరమైన కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను తినాల్సి ఉంటుంది. శ్వాసనాళం వాపును తగ్గించడానికి శోథ నిరోధక యాంటీ ఆక్సిడెంట్లను కలిగున్న ఆహారాన్ని తినాలి. బెర్రీలు, డార్క్ చాక్లెట్, పసుపులు మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి.