బోర్లా పడుకుంటే ఏమౌతుందో తెలుసా?
కొంతమందికి బోర్లా పడుకోగానే వెంటనే నిద్రలోకి జారుకుంటారు. కానీ ఇలా పడుకోవడం వల్ల ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అసలు ఇలా పడుకునే అలవాటు వల్ల ఏమౌతుందో తెలుసా?
కొందరికి వెల్లకిలా పడుకునే అలవాటు ఉంటే.. మరికొందరికి బోర్లా పడుకునే అలవాటు ఉంటుంది. ఇలా పడుకుంటేనే వీళ్లకు తొందరగా నిద్రపడుతుంది. అలాగే కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది. కానీ కొన్ని స్లీపింగ్ పొజీషన్స్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇలాంటి వాటిలో బోర్లా పడుకోవడం కూడా ఉంది. బోర్లా పడుకోవడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హెల్త్ లైన్ ప్రకారం.. మీరు బోర్లా పడుకోవడం వల్ల గురకను తగ్గించొచ్చు. లేదా స్లీప్ అప్నియా వంటి కొన్ని సమస్యల నుంచి బయటపడొచ్చు. కానీ ఇలా పొట్టపై పడుకోవడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. అవేంటంటే?
కడుపుపై నిద్రపోవడం వల్ల మీ వెన్నెముక, మెడపై చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పొజీషన్ మీ బాడీని హాని చేస్తుంది. ఇది శరీర భాగాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే ఇది దీర్ఘకాలిక నొప్పులకు కూడా దారితీస్తుందని హెల్త్ లైన్ సూచిస్తోంది.
మీరు కడుపుపై నిద్రపోవడం వల్ల వెన్నెముక తన స్థానాన్ని నిర్వహించడం కష్టతరం అవుతుందని నిపుణులు పరిశోధనలు చెబుతున్నాయి. శరీర బరువులో ఎక్కువ భాగం కేంద్రీకృతంగా ఉండటం వల్ల మీరు నిద్రపోతున్నప్పుడు వెన్నెముకలో అసహజ వక్రత సంభవిస్తుంది. ఈ పొరపాటు మీ వెన్నును ప్రభావితం చేయడమే కాకుండా మీ శరీరాన్ని నొప్పులు, అనారోగ్యం బారిన పడేస్తుంది.
కడుపుపై నిద్రపోవడం వల్ల మీ తలను ఒక వైపునకు తిప్పాల్సి వస్తుంది. కానీ ఇది కాలక్రమేనా హెర్నియేటెడ్ డిస్క్ లు వంటి ప్రమాదకరమైన సమస్యలకు దారితీస్తుందని హెల్త్ లైన్ సూచిస్తోంది.
పొట్టపై పడుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మీరు బోర్లా పడుకోకూడదంటే తలకింద దిండును వేసుకోకండి. లేదా మరీ సన్నగా ఉండే దిండును వేసుకోండి. మెత్తని దిండు మీ మెడను చాలా తక్కువగా వంచుతుంది. దీనివల్ల మీరు బోర్లా పడుకునే అలవాటు తగ్గిపోతుంది. మీ వెన్నెముక సరిగ్గా ఉండాలంటే మీ కటి ప్రాంతం కింద దిండును ఉంచండి. అలాగే సున్నితంగా మీ శరీరాన్ని సాగదీయండి. దీనివల్ల సహాయక కండరాలు బలోపేతం అవుతాయి.
- sleeping on your stomach
- sleeping on your stomach after c section
- sleeping on your stomach benefits
- sleeping on your stomach during pregnancy
- sleeping on your stomach good or bad
- sleeping on your stomach is bad
- sleeping on your stomach meaning
- sleeping on your stomach personality
- sleeping on your stomach position
- sleeping on your stomach risks