Asianet News TeluguAsianet News Telugu

జిమ్ చేస్తుండగా గుండెపోటు.. యువత ఎందుకు కుప్పకూలుతున్నారు, కార్డియాలజిస్ట్‌లు ఏమంటున్నారంటే..?

ఇటీవలికాలంలో ఫిట్‌నెస్ సెంటర్లలో ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ యువత గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు గుండెపోటు రావడానికి కారణం ఏంటనే దానిపై కార్డియాలజిస్ట్‌లు కొన్ని సూచనలు చేస్తున్నారు. 

reasons to heart attack while exercising at gym centers, top doctors flag mistakes
Author
First Published Nov 23, 2022, 9:01 PM IST

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇటీవల టెలివిజన్ నటుడు సిద్ధాంత్ సూర్యవంశీలు హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోయిన వ్యవహరం కలకలం రేపిన సంగతి తెలిసిందే. చాలా చిన్న వయసులోనే వీరు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అయితే మితిమీరిన వర్కవుట్లు, డైట్ కారణంగానే వీరిద్దరితో పాటు మరికొందరు నటుడు జిమ్‌లలో కూర్చొన్న వాళ్లు కూర్చొన్నట్లే ప్రాణాలు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఫిట్‌నెస్ కోసం కష్టపడుతుండగా హార్ట్ ఎటాక్స్ రావడం ఏంటనే దానిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఫిట్‌నెస్ ఫ్రీక్స్ హార్ట్ ఎటాక్స్ అంటే ఏమిటీ..? ఇది ఎలా సంభవిస్తుంది..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై హృద్రోగ నిపుణులు సలహాలు ఇస్తున్నారు.

గుండెపోటు అనేది సాధారణంగా రక్తం గడ్డకట్టడం వలన గుండెకు రక్త ప్రసరణ నిలిచిపోవడం, ఆక్సిజన్ సరఫరాకు ఆటంకం ఏర్పడినప్పుడు సంభవించే ఓ అత్యవసర పరిస్ధితి. రక్తం, ఆక్సిజన్ సరఫరా లేకుంటే గుండె కండరాలు దెబ్బతినడం ప్రారంభమై, అంతిమంగా గుండెపోటుకు దారి తీస్తుంది. హృద్రోగ నిపుణులు చెబుతున్న దానిని బట్టి గుండె ధమనులలో 100 శాతం లేదా 70 శాతం అడ్డంకులు, సైలెంట్ బ్లాక్‌లు గుండెపోటుకు కారణాలట. కరోనా తర్వాత ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ కలిగిందని, వైద్యుడి సలహా లేకుండా విస్తృతంగా వ్యాయామాలు చేస్తున్నారని నిపుణులు అంటున్నారు. 

అలాగే విపరీతంగా సప్లిమెంట్స్, స్టెరాయిడ్స్ తీసుకోవడం వలన గుండె ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఇక అరిథ్మియా అనేది గుండె నుంచి వచ్చే విద్యుత్ సంకేతాలకు అంతరాయం కలిగించే ఒక దుష్ప్రభావం. ఇది శరీర అవయవాలకు రక్త ప్రసరణను తగ్గించి ఒక్కసారిగా గుండె వైఫల్యానికి, స్ట్రోక్‌కు దారి తీస్తుంది. వైద్యులు చెబుతున్న దానిని బట్టి.. మానవ హృదయం విస్తృతమైన వ్యాయామ స్థాయిలకు అనుగుణంగా లేదట అయినప్పటికీ ప్రజలు వెయిట్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు చేస్తున్నారని.. ఇది గుండె ఆరోగ్యంపై ఒత్తిడిని కలిగిస్తుందని డాక్టర్లు అంటున్నారు. ఎందుకంటే ఏదైనా వ్యాయామం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్దతులు వుంటాయి. 

విస్తృతమైన వ్యాయామాలు చేసేటప్పుడు అధిక రక్తపోటుకు దారి తీస్తుందని, ఇది శరీరంలోని మిగిలిన భాగాలకు రక్తాన్ని సరఫరా చేసేందుకు గుండెపై అదనపు భారాన్ని కలిగిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ కారణం చేత దిగువ ఎడమ గుండె గది గట్టిపడుతుందని, దీని వల్ల గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్ట్ ప్రమాదం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. 

గుండెపోటుకు సంకేతాలు :

జన్యుశాస్త్రం : భారతీయులు గుండె జబ్బులకు ఎక్కువగా గురవుతారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా వుండటం, జంక్ ఫుడ్స్ తీసుకోవడం, జీవనశైలిలో మార్పుల కారణంగా ఈ పరిస్థితులు చోటు చేసుకుంటున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

ఊబకాయం: అతిగా తినడం, అనారోగ్యకరమైన ఆహార ఎంపికల కారణంగా శరీరంలోని పొత్తికడుపు భాగంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయం ఏర్పడుతుంది. దీని కారణంగా కార్డియోవాస్క్యులార్ వ్యాధులు తలెత్తుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గుండెపోటు రావడానికి ఎక్కువ శాతం అవకాశం వున్న సంకేతాల్లో ఊబకాయం ఒకటి. స్థూలకాయం కారణంగా ధమనుల్లో కొవ్వు పదార్థాలు పేరుకుపోయి గుండెపోటుకు దారి తీస్తుంది. 

అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు : గుండె జబ్బులకు అతిపెద్ద కారణాలివే. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా వుంటే గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. అధికంగా ఆల్కహాల్ , ధూమపానం తీసుకోవడం వంటివి అధిక రక్తపోటుకు దారితీస్తుందని.. ఇది అంతిమంగా గుండెపోటుకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. 

గుండెపోటును ఎలా గుర్తించాలి :

నిపుణులు గుండెపోటు వచ్చే ముందు కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చని చెబుతున్నారు. విపరీతమైన అలసట, నడుస్తున్నప్పుడు శ్వాస ఆడకపోవడం, అధికంగా చెమట పట్టడం వంటివి ఒక వ్యక్తికి గుండెపోటు రావడానికి ముందు చోటు చేసుకుంటాయి. 

గుండెపోటు రాకుండా ముందు జాగ్రత్తలు:

1. గుండెపోటుకు సంబంధించిన లక్షణాలుగా ఏవైనా అనిపిస్తే వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లాలి. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. 

2. కొలెస్ట్రాల్ , రక్తంలో చక్కెర , రక్తపోటు, గ్లూకోజ్ స్థాయిలను తనిఖీ చేయించుకోవాలి.

3. ట్రైనర్, వైద్యుడిని సంప్రదించకుండా విస్త్రతమైన వ్యాయామాలు చేయడం చేయరాదు. వ్యాయామం చేస్తుండగా గుండెపోటుకు సంబంధించిన హెచ్చరికలు, లక్షణాలు కనిపిస్తే వెంటనే దానిని ఆపివేసి.. వైద్యుడి వద్దకు వెళ్లాలి. 

4. హెవీగా భోజనం చేసిన సందర్భాల్లో ఎప్పుడూ జిమ్‌కి వెళ్లొద్దు. ఇలా చేయడం వల్ల శరీర భాగాలు దెబ్బతినడమే కాకుండా గుండెపోటుకు దారి తీసేలా హృదయ స్పందన రేటు పెరుగుతుంది. 

5. సీటీ యాంజియోగ్రఫీ పరీక్ష గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా వున్న వ్యక్తులకు సూచిస్తారు. దీని ద్వారా గుండె ఆరోగ్య పరిస్ధితులను ఎప్పటికప్పుడు అంచనా వేయొచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios