Ramadan 2023: ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసం ఉంటారు. కానీ ఈ ఉపవాసం సమయంలో కొన్ని తప్పులు శరీర బరువు విపరీతంగా పెరుగుతుంది.
Ramadan 2023: కొంతమంది బరువు తగ్గడానికి కూడా ఉపవాసం ఉంటారు. అలాగే రంజాన్ లో కూడా ఉపవాసం ఉంటారు. ఉపవాసం మీ బరువును తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. రంజాన్ లో రోజంతా ఏమీ తినకుండా, తాగకుండా ఉపవాసం ఉండి సాయంత్రం పూట ఆహారాన్ని తీసుకుంటారు. అయినప్పటికీ కొందరు ఈ ఉపవాసం సమయంలో కూడా విపరీతంగా బరువు పెరిగిపోతుంటారు.
ఉపవాసం ఉన్నవారు చేసే ఒక సాధారణ తప్పేంటంటే.. ఉపవాసం లేని సమయంలో ఎక్కువ తినడం. ఇదే బరువు తగ్గడం కంటే విపరీతంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. అసలు ఉపవాసం సమయంలో ఎలాంటి తప్పులు చేస్తే బరువు పెరుగుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎక్కువగా తినడం
నిపుణుల ప్రకారం.. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ శరీరం శక్తి కోసం నిల్వ చేసిన కొవ్వును ఉపయోగించడం ప్రారంభిస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ ఉపవాసం విరమించిన తర్వాత ఎక్కువ తింటే మీరు బరువు పెరిగే ఛాన్స్ ఉంది. కేలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్ ను తింటే మీరు ఈ రంజాన్ మాసంలో ఖచ్చితంగా బరువు పెరుగుతారు.
సహరీలో ఎక్కువ కేలరీలను తీసుకోవడం
రంజాన్ మాసంలో అల్పాహారం సహరిలో ఎన్నో రకాల వంటకాలు ఉంటాయి. ముఖ్యంగా దీనిలో చక్కెర ఎక్కువగా ఉండే వివిధ రకాల స్వీట్లు ఉంటాయి. రంజాన్ లో బరువు తగ్గాలనుకుంటే బ్రేక్ ఫాస్ట్ సమయంలో తినే క్యాలరీలను వీలైనంత వరకు తగ్గించండి. ఎక్కువ కేలరీలు లేని ఆహారాన్ని తినండి. అల్పాహారం కోసం పండ్లు, కూరగాయలు తినడానికి ప్రయత్నించండి.
ఇఫ్తార్ విందులో అతిగా తినకండి
ఇఫ్తార్ లో తేలికపాటి ఆహారాన్నే తినండి. ఇఫ్తార్, సహరీ మధ్య తినకుండా ఉండండి. ఫైబర్, వాటర్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే బరువు తగ్గించే ఆహారాలనే ఉపవాసం తర్వాత తినండి. నాన్ క్రీమీ సూప్లు, సలాడ్లను తీసుకోండి. ఎందుకంటే వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి.
యాక్టివ్ గా లేకపోవడం
రంజాన్ సమయంలో ఎక్కువ మంది శారీరక కార్యకలాపాల్లో పాల్గొనరు. కానీ ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. ఉపవాసం ఉన్నా.. వాకింగ్, షాపింగ్ లేదా ఇంటిని శుభ్రపరచడం వంటి వంటి పనులను 15 నుంచి 45 నిమిషాల పాటు చేయండి. బరువు నియంత్రణలో ఉంటుంది.
