ఉదయం నడిస్తే మంచిదా.. తిన్నాకా వాక్ చేస్తే మంచిదా.. డాక్టర్ల సలహా ఇదిగో

వాకింగ్‌ మంచి అలవాటు అని అందరికీ తెలుసు. కాని పాటించడం కష్టం అనుకుంటారు. ఏదైనా హెల్త్‌ ప్రాబ్లమ్‌ వచ్చినప్పుడు మాత్రం అందరికీ  ముందు గుర్తొచ్చేది వాకింగ్‌.  అయితే మరి తెల్లవారుజామున, ఖాళీ కడుపుతో నడవడం మంచిదా.. లేక భోజనం చేశాక నడవడం మంచిదా.. డాక్టర్లు ఏం సలహాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
 

Morning Walk or Post-Meal Stroll: What Do Doctors Recommend? sns

ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య ఉందని హాస్పిటల్‌కు వెళిలే డాక్టర్‌ ముందు అడిగే ప్రశ్న మీకు వాకింగ్‌ అలవాటు ఉందా అని.. లేకపోతే వాకింగ్‌ చేయండి అన్ని ప్రాబ్లమ్స్‌ క్లియర్‌ అయిపోతాయని, నడక ప్రాథమిక ఆరోగ్య సూత్రమని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. కనీసం రోజుకు 30 నిమిషాలైనా నడవాలంటున్నారు. అంతకు మించి ఎంత ఎక్కువ నడిస్తే అంత ఆరోగ్యమని సూచిస్తున్నారు. మరి ఏ  సమయంలో నడక మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

వెయిట్‌ లాస్‌ కోసం వాకింగ్‌..
సాధారణంగా అందరూ వాకింగ్‌ చేసేది బాడీ వెయిట్‌ తగ్గడానికి. కాని వాకింగ్‌ చేయడం వల్ల ఈ ఒక్క ప్రయోజనమే కాకుండా ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అనవసరమైన కొవ్వు పదార్థాలు కరగడానికి, రక్తప్రసరణ మెరుగవడానికి, మైండ్‌ రిలాక్స్‌ కావడానికి, శరీరంలోని టాక్సిక్‌ పదార్థాలు చెమట రూపంలో బయటకు వెళ్లడానికి వాకింగ్‌ ఉపయోగపడుతుందట.

ఖాళీ కడుపుతో వాకింగ్‌ చేస్తే ప్రయోజనాలు..
నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో వాకింగ్‌ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మెటబాలిజం మెరుగవుతుంది. ఎనర్జీ లెవెల్స్‌ పెరుగుతాయి. బరువు తగ్గవచ్చు. కొవ్వు కరుగుతుంది. ఉదయపు ఎండలో నడవడం వల్ల శరీరానికి అవసరమైన డి విటమిన్‌ అందుతుంది. 

తిన్న తర్వాత నడిస్తే ఉపయోగాలు..
భోజనం చేసిన తర్వాత 100 అడుగులైనా వెయ్యాలని పెద్దలు చెబుతుంటారు. అంటే తిన్న వెంటనే నడవకూడదు. భోజనం చూసిన 5, 10 నిమిషాల తర్వాత వాకింగ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. అంతేకాకుండా రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరగకుండా చేస్తుంది. డైజేషన్‌ సిస్టమ్‌ను ఇంప్రూవ్‌ చేస్తుంది. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది. షుగరు వ్యాధిని కంట్రోల్‌లో ఉంచుతుంది. ఎసిడిటీని తగ్గిస్తుంది. 

ఏ నడక మంచిదంటే..
ఉదయం ఖాళీ కడుపుతో నడిచే నడక, భోజనం చేశాక వాకింగ్‌ ఈ రెండింటిలో ఏది మంచిది అంటే.. డాక్టర్లు రెండూ మంచివే అని చెబుతున్నారు. మార్నింగ్‌ వాక్‌ వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, శక్తి వస్తాయని, భోజనం చేసిన తర్వాత చేసే వాకింగ్‌ వల్ల శరీరం రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios