తేనే, లవంగాలు ఆరోగ్యానికి చాలా మంచివనే విషయం అందరికీ తెలుసు. కానీ ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా? వాటి ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

తేనె, లవంగాలలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ రెండింటినీ సరైన మోతాదులో కలిపి తీసుకుంటే, అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి వీటిని ఆహారంలో ఎలా భాగం చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఒక చెంచా తేనెలో చిటికెడు లవంగం పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఛాతిలో కఫం, దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి తేనె, లవంగాలను కలిపి తీసుకోవచ్చు.

ఆహారంలో తేనె, లవంగాలను చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది . తరచూ అనారోగ్యానికి గురయ్యేవారు ఈ మిశ్రమాన్ని తప్పకుండా ట్రై చేయండి. తేనె, లవంగాలతో నోటి పూత నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

తేనెలో విటమిన్ బి, కాల్షియం, జింక్, ఇనుము, రాగి లాంటి అనేక పోషకాలు ఉంటాయి. లవంగాలలో భాస్వరం, మెగ్నీషియం, ఫోలేట్, ఫైబర్, విటమిన్లు, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మెరుగైన ఆరోగ్యం కోసం.. ఈ రెండింటినీ మితంగా తీసుకోవాలి.