వంట రుచిగా ఉండాలంటే ఉప్పు తప్పనిసరి. ఎంత గొప్ప వంటకమైనా సరిపడా ఉప్పు లేకపోతే దానికి రుచి ఉండదు. మరి రోజూవారి ఆహారంలో ప్రధానమైన ఈ ఉప్పు గురించి కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ప్రసుతం చాలా రకాల ఉప్పులు అందుబాటులో ఉన్నాయి. మరి వీటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?
ఉప్పు లేనిదే వంటింట్లో ఏ పని జరగదు. కూర వండాలన్నా, చట్నీ చేయాలన్నా ఉప్పు తప్పనిసరి. సాధారణంగా మనం ఇంట్లో చాలా రకాల ఉప్పులు వాడుతుంటాం. వాటిలో కొన్ని.. అయోడిన్ ఉప్పు, నల్ల ఉప్పు, హిమాలయన్ ఉప్పు. ప్రతి ఉప్పు వాడకం వేరు. వాటి ప్రయోజనాలు వేరు. అయితే ఏ ఉప్పు ఆరోగ్యానికి మంచిదో చూద్దాం.
హిమాలయన్ ఉప్పు:
మూలం: పాకిస్తాన్ లోని కెవ్రా ఉప్పు గనులు
రూపం: ముదురు, పింక్ క్రిస్టల్స్
పోషకాలు: 84+ మినరల్స్ - ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం
సోడియం: సాధారణ ఉప్పు కన్నా 33% తక్కువ
సహజత్వం: ఎలాంటి కల్తీ లేదు
ప్రయోజనాలు:
- శరీరానికి నీటిని అందిస్తుంది.
- రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- జీర్ణక్రియకు సహాయపడుతుంది.
- బీపి తగ్గిస్తుంది.
- సహజ యాంటీ బాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది
నష్టాలు:
- ఐయోడిన్ లేదు. థైరాయిడ్ కి ఇది అవసరం.
- అశుద్ధాలు ఉండవచ్చు. లెడ్, మెర్క్యురీ లాంటివి.
- వంటకి పనికిరాదు. ఎక్కువ వేడికి మినరల్స్ పోతాయి.
అయోడిన్ ఉప్పు:

తయారీ: శుద్ధి చేసిన ఉప్పులో ఐయోడిన్ కలుపుతారు.
రూపం: చిన్న, తెల్లటి క్రిస్టల్స్.
అవసరం: థైరాయిడ్, శరీర వృద్ధికి ఐయోడిన్ అవసరం.
వ్యాధుల నివారణ: గాయిటర్, క్రెటినిజం లాంటివి.
ప్రయోజనాలు:
- థైరాయిడ్ ఆరోగ్యానికి మంచిది.
- ఐయోడిన్ లోపం రాకుండా చూస్తుంది.
- తక్కువ ధర. సులభంగా దొరుకుతుంది.
నష్టాలు:
- శుద్ధి చేసినప్పుడు ఇతర మినరల్స్ పోతాయి.
- కొన్ని కెమికల్స్ కలుపుతారు.
- ఎక్కువగా తీసుకుంటే బీపి పెరగవచ్చు.
ఏది బెస్ట్?:

రెండూ వాడండి:
హిమాలయన్ ఉప్పు: మినరల్స్ కోసం.
ఐయోడైజ్డ్ ఉప్పు: ఐయోడిన్ కోసం.
ఇవి గుర్తుంచుకోండి:
- రోజుకి 5 గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు వాడకండి.
- వంటకి హిమాలయన్ లేదా శుద్ధి చేయని సముద్రపు ఉప్పు వాడండి.
- రోజువారీ అవసరాలకి ఐయోడైజ్డ్ ఉప్పు వాడండి.
