Asianet News TeluguAsianet News Telugu

బరువు తగ్గడానికి డైట్ ను ఫాలో అవుతున్నారా? అయితే ఈ ఆహారాలను పొరపాటున కూడా తినకండి

మీరు తీసుకునే ఆహారం ఆరోగ్యకరమైంది అయితే.. మీరు సులువుగా బరువు తగ్గొచ్చు. ఇలా తగ్గాలంటే కొన్ని తెల్ల ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగించడమే కాదు.. మీరు బరువు తగ్గకుండా చేసి.. మీ బరువును అమాంతం పెంచేస్తాయి. 
 

Here are 3 white foods you should avoid to lose weight
Author
First Published Feb 9, 2023, 3:43 PM IST

తెల్ల ఆహారం మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. తెల్ల ఆహారం అంటే మరింకేదో కాదు.. పిండి, బియ్యం, పాస్తా, బ్రెడ్, తృణధాన్యాలు, షుగర్, ఎక్కువ ఫ్రక్టోజ్ కార్న్ సిరప్  లు వంటి తెల్ల రంగులో ఉన్న ప్రాసెస్ చేసిన, శుద్ధి చేసిన ఆహారాలు. అలా అని బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, కాలీఫ్లవర్, టర్నిప్స్, వైట్ బీన్స్ వంటివి వీటి కిందికి రావు. ఎందుకంటే ఇవి సేంద్రీయమైనవి. ప్రాసెస్ చేయని తెల్ల ఆహారాలు. ప్రాసెస్ చేసిన, శుద్ధి చేసి తెల్ల ఆహారాలు మన ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి. వీటిలో పోషాకాలు ఏ మాత్రం ఉండవు. కానీ కార్బోహైడ్రేట్లు మాత్రం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇలాంటి ఆహారాలను ఎక్కువగా తినకూడదు. ముఖ్యంగా వెయిట్ లాస్ డైట్ ను ఫాలో అయ్యే వారు ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి బరువును ఏమాత్రం తగ్గించవు. అంతేకాదు మీ బరువును మరింత పెంచుతాయి. ఎన్నో సమస్యల బారిన పడేస్తాయి. వెయిట్ లాస్ డైట్ ను ఫాలో అయ్యే వారు ఎలాంటి తెల్ల ఆహారాలను తినకూడదంటే.. 

వైట్ బ్రెడ్

మీరు పూర్తిగా మానేయాల్సిన తెల్ల ఆహారాల్లో వైట్ బ్రెడ్ ఒకటి. ఇవి మాత్రమే కాదు తెల్ల పిండి, పేస్ట్రీలను కూడా తీసుకోకూడదు. శుద్ధి చేసిన బ్రెడ్ పిండిని తయారుచేయడానికి మిల్లింగ్ ప్రక్రియలో ధాన్యంలో ఉండే సూక్ష్మక్రిమి, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలను  చాలా వరకు తొలగిస్తారు. అందుకే బరువు తగ్గాలనుకుంటే వైట్ బ్రెడ్, ఇతర శుద్ధి చేసిన-ధాన్యపు ఆహారాలను తగ్గించండి.  వీటికి బదులుగా తృణధాన్యాల రొట్టెను తీసుకోండి. ఎందుకంటే వైట్ బ్రెడ్ ను తినడం వల్ల బరువు పెరుగుతారు. 

తెల్ల చక్కెర

నిజానికి చక్కెర కూడా  మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దీన్ని ప్రాసెస్ చేస్తారు. దీన్ని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇది మీ శరీరంలో కొవ్వును పెంచేస్తుంది. ఇది  గుండె జబ్బులకు కారణమవుతుంది. చక్కెర ప్రమాదకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా పెంచుతుంది. అలాగే ఆకలిని నియంత్రించే మీ శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. చక్కెర తీసుకోవడం వల్ల మీరు స్వీట్లను బాగా తినే అవకాశం ఉంది. ఇది కావిటీస్ కు కారణమవుతుంది. అందుకే ఇలాంటి చక్కెరకు దూరంగా ఉండటమే మంచిది. చక్కెరకు బదులుగా పండ్లను తినండి. వీటిలో సహజ చక్కెరలు  ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచే చేస్తాయి.  ఈ వైట్ షుగర్ కు బదులుగా బ్రౌన్ షుగర్, స్టెవియా, మాపుల్ సిరప్ లేదా తేనెను తీసుకోండి. చక్కెరతో పోలిస్తే ఇవి మన ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. 

తెల్ల బియ్యం

వైట్ పాస్తా, వైట్ బ్రెడ్ మాదిరిగా తెల్ల బియ్యం కూడా శుద్ధి చేసినవే.  తృణధాన్యాల నుంచి పిండి మెత్తటి తెల్ల బియ్యంగా మారుతుంది. ప్రస్తుత కాలంలో తెల్లబియ్యాన్నే ఎక్కువగా తింటున్నారు. కానీ తెల్ల బియ్యంలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ మొత్తమే ఉండవు. అందుకే వీటిని తినడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటారు చాలా మంది. తెల్ల బియ్యాన్ని తినడం వల్ల బరువు పెరగడంతో పాటుగా రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. అందుకే వైట్ రైస్ ను ఎక్కువగా తీసుకోకూడదు. 

Follow Us:
Download App:
  • android
  • ios