ఉదయం మనం తినే బ్రేక్ ఫాస్ట్ లో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే బ్రేక్ ఫాస్ట్ మనల్ని రోజంతా శక్తివంతంగా, చురుగ్గా ఉంచడానికి సహాయపడుతుంది కాబట్టి.
కొంతమంది బరువు తగ్గాలని, ఇంకొంతమంది బిజీ షెడ్యూల్స్ వల్ల ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే అల్పాహారమే మనకు శక్తినిస్తుంది. అలాగే మన కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. నిజానికి బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం వల్ల మధ్యాహ్నం హెవీగా తినే అవకాశం ఉంది. ఇది మీ బరువును మరింత పెంచుతుంది. అయితే బ్రేక్ ఫాస్ట్ లో అవి ఇవి కాకుండా.. పోషకాలు ఎక్కువగా ఉండే వాటినే తినడం మంచిది. ఎందుకంటే గంటల తరబడి నిండుగా ఉంచుతుంది.అలాగే శక్తివంతంగా ఉంచుతుంది. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, సూక్ష్మపోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలు సాయంత్రం ఆహార కోరికలను నియంత్రించడానికి సహాయపడతాయి. అలాగే ఇవి మీ జీవక్రియను కూడా మెరుగుపరుస్తాయి. ఆరోగ్యంగా ఉండేందుకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పోషకాహార నిపుణుల ప్రకారం, సరైన అల్పాహారం రెండు పనులను చేస్తుంది. ఒకటి మీ శరీరానికి అవసరమైన పోషక అవసరాలను తీరుస్తుంది. రెండు మీ శక్తి స్థాయిలను ఎక్కువగా ఉంచుతుంది. ఒక సాధారణ ఆరోగ్యకరమైన అల్పాహారంలో ఎన్నో రకాల ఆహారాలు ఉంటాయి. తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ప్రోటీన్ లేదా పాల వనరులు, పండ్లు ఈ జాబితాలో ఉంటాయి. వీటిని తిన్నా మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే వేయించిన ganthia, చక్లిస్, వేయించిన దోశ, స్టఫ్డ్ పరాఠాలు, పూరీ బాజీ, బటాటా వడలు, medu వడలు వంటి కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలను అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఏదైనా ఆహారం జీర్ణం కావడానికి ఎంత ఎక్కువ సమయం పడుతుందో.. అది మీ మానసిక శక్తిని తగ్గిస్తుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఎలాంటి ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ను చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
- పుదీనాతో కొత్తిమీర జ్యూస్
- టోస్ట్ పై గుడ్డు
- గ్రీన్ చట్నీ
- టొమాటో-క్యారెట్ జ్యూస్ తో పెసరపప్పు దోశ
- పెరుగు, బూడిద సొరకాయ రసంతో గోబీ పరాట
- తేలికగా తినేవారికి: ఒక ఉడికించిన గుడ్డు + 5-8 బాదం పప్పులు + 1 గ్లాసు టమోటా-సెలెరీ రసం
- ఒక గిన్నె తాజా పండ్లు
