సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలలో మూత్ర సంబంధిత వ్యాధులు రావడం చాలా ఎక్కువగా ఉంటుంది. శరీర నిర్మాణం మూత్ర వ్యవస్థ నిర్మితమైన తీరు వల్ల మహిళలలో మూత్ర సమస్యలు, ఇన్ఫెక్షన్లు తొందరగా సోకే ప్రమాదం ఉంటుంది. ఇలా మహిళలలో తరచూ ఇలాంటి ఇన్ఫెక్షన్లు సోకడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అయితే ఈ కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే...
సాధారణంగా ఇంట్లో ఉండే మహిళలకు బయటకు వెళ్లి పనిచేసే మహిళలకు మధ్య ఎంతో వ్యత్యాసాలు ఉంటాయి. బయటకు వెళ్లి పని చేసే మహిళలు వారి ఆఫీసులలో సరైన వసతులు ఉండకపోవటం వల్ల వారు ఎక్కువగా మూత్ర విసర్జనకు వెళ్లరు. తద్వారా ఎక్కువగా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదాలు ఉంటాయి.ఒకవేళ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్ లో సరైన పరిశుభ్రత లేకపోవడం వల్ల వెళ్లడానికి చాలామంది ఇష్టపడరు అందుకే అలాగే ఆపుకొని ఉంటారు.
సాధారణంగా మన శరీరంలో ఉన్నటువంటి వ్యక్తపదార్థాలన్నీ కూడా యూరిన్ రూపంలో బయటకు వెళ్తాయి అయితే మనం యూరిన్ వెళ్లకుండా ఎక్కువసేపు అలాగే బిగుబట్టుకొని ఉండటం వల్ల బ్లాడర్ మొత్తం మన శరీరంలో ఉన్న వ్యక్తపదార్థాలతో నిండిపోతుంది. ఈ క్రమంలోనే అక్కడ హానికర బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది తద్వారా మూత్రశయపు ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. ఇది మరింత ఎక్కువైతే కిడ్నీ ప్రమాదానికి కూడా కారణమవుతాయి.
ఇక చాలామంది మహిళలు ఆఫీసులలో సరైన వాష్రూమ్స్ ఉండకపోవటం వల్ల వాళ్లు ఎక్కువగా నీళ్లు తాగడానికి ఇష్టపడరు. ఇలా నీటిని అధికంగా తీసుకోకపోవడం వల్ల శరీరంలో వ్యర్ధాలు యూరిన్ రూపంలో బయటకు వెళ్లకుండా అలాగే శరీరంలో పేరుకు పోతాయి. ఇలా మూత్రశయం ఎక్కువసేపు ఆపుకోవటం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.ఇలా మొదటిసారి ఈ ఇన్ఫెక్షన్ రావడానికి ప్రైమరీ ఇన్ఫెక్షన్ అంటారు. అయితే పదే పదే ఇలాంటి ఇన్ఫెక్షన్లు కనుక సోకుతూ ఉన్నట్లయితే పర్సిస్టెంట్ బ్యాక్టీరియూరియా లేదా రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్ అంటారు.
ఈ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు మూత్రవిసర్జన సమయంలో మంట తరచూ విసర్జనకు వెళ్లాలనిపించడం చాలి జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే యాంటీబయోటిక్స్ టాబ్లెట్స్ వేసుకోవడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు లేదా ఈ ఇన్ఫెక్షన్ మరింత తీవ్రతరం అయితే తప్పనిసరిగా నిపుణురాలైన వైద్యుల సమక్షంలో హాస్పిటల్లో అడ్మిట్ అయి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
