Asianet News TeluguAsianet News Telugu

ఉగాది పచ్చడిలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయో..!

తెలుగువారి కొత్త సంవత్సరం ఈ ఏడాది మార్చి 22 తారీఖున వచ్చింది. మరి ఉగాదికి స్పెషలేంటో అందరికీ తెలుసిందే. ఉగాది పచ్చడిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Health Benefits of Ugadi Pachadi
Author
First Published Mar 17, 2023, 4:17 PM IST

ఉగాదే తెలుగు వారికి కొత్త సంవత్సరం. అందుకే ఈ పండుగను గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఉగాదికి షుడ్రుచుల పచ్చడే స్పెషల్. ఇది తీయగా, పుల్లగా, చేదుగా ఆరు రుచుల్లో కమ్మగా ఉంటుంది. ఈ ఆరు రుచులు మన భావోద్వేగాలను తెలుపుతాయి. తీపి, చేదు లాగ కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని ఈ పచ్చడి మనకు సందేశమిస్తుంది. అయితే ఈ పచ్చడిని పరిగడుపున తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 

తీపి

ఈ పచ్చడిని తయారుచేయడానికి కొత్తబెల్లాన్ని ఉపయోగిస్తారు. తీపి ఆనందాన్ని సూచిస్తుంది. నిజానికి కొత్తబెల్లాన్ని తింటే మనకు ఆకలి కలుగుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తీపిని ఇష్టపడని వారే ఉండరు. అయితే బెల్లం మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది పిత్తం, వాతం సమస్యలను తగ్గిస్తుంది. కొత్త కణాలను ఏర్పరిచేందుకు సహాయపడుతుంది. చక్కెరనే బరువును పెంచుతది కానీ బెల్లం కాదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా ఏం పెంచదు. అయినప్పటికీ దీన్ని లిమిట్ లోనే తినడం మంచిది. 

పులుపు

చింతపండు పులుపుతో చేసిన పప్పు చారు ఇతర కూరలు బలే టేస్టీగా అవుతాయి. పులుపు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చింతపండుతో పచ్చడి రుచి అదిరిపోతుంది. ఈ పచ్చడిలోని పులుపు విసుకును సూచిస్తుంది. అంటే ఇది ఎలాంటి పరిస్థితులకైనా ఓర్పుగా ఉండాలని సూచిస్తుంది. చింతపండును తింటే కఫ వాతం పోతుంది. జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. చింతపండును తింటే ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. ఇది మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

కారం

కారం సహనాన్ని కోల్పోవడాన్ని సూచిస్తుంది. ఆరోగ్యం విషయానికి కొస్తే.. కారాన్ని మితంగా తీసుకుంటే ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీర్ఱక్రియకు సహాయపడుతుంది. అలాగే శరీరంలో ఉండే క్రిములను చంపి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కారం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నా.. దీన్ని ఎక్కువగా తినకూడదు. లేదంటే కడుపులో మంటతో పాటుగా ఎన్నో సమస్యలు వస్తాయి. 

ఉప్పు

ఇది రుచిని, భయాన్ని సూచిస్తుంది. అయితే ఉప్పు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.. ఇది మన జీర్ణశక్తిని పెంచి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆకలిని కూడా కలిగిస్తుంది. కానీ ఉప్పును ఎక్కువగా తీసుకుంటే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా కలుగుతాయి. ఎందుకంటే ఉప్పును మోతాదుకు మించి తింటే గ్యాస్, ఎసిడిటీ, మూత్రపిండాల సమస్యలు వస్తాయి. 

చేదు

ఉగాది పచ్చడిలో వేపపువ్వును కూడా ఉపయోగిస్తారు. ఈ రుచి మన బాధలకు సంకేతం. కానీ వేపపూత మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మన శరీరంలో ఉండే వ్యర్థాలను తొలగిస్తుంది. బ్లడ్ ను శుద్ధి చేస్తుంది. అంతేకాదు వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా సహాయపడుతుంది. అలాగని దీన్ని ఎక్కువగా తినకూడదు. 

వగరు

ఎండాకాలంలోనే మామిడి కాయలు పండుతాయి. అయితే వీటిని కూడా ఉగాది పచ్చడిలో వేస్తారు. మామిడి కాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి శరీరాన్ని బలంగా చేస్తాయి. శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీర మంటను తగ్గిస్తాయి. అలా అని వీటిని ఎక్కువగా తింటే పేగుల సమస్యలు వస్తాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios