పొప్పడి పండే కాదు పచ్చి పొప్పడి కాయ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ బొప్పాయిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు, ఎంజైమ్లు పుష్కలంగా ఉంటాయి. పచ్చి బొప్పాయి రసం తాగడం వల్ల అధిక కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది. అలాగే..
బొప్పాయి పండు మన ఆరోగ్యానికి, చర్మానికి ఎంతటి మేలు చేస్తుందో మనకు తెలుసు. అయితే పచ్చి బొప్పాయి కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. పచ్చి బొప్పాయిలో విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ బొప్పాయి ధమనులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పెరిగిన ప్రసరణ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. పచ్చి బొప్పాయిలో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, తక్కువ కేలరీలతో పాటుగా విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. పచ్చి బొప్పాయి రసం మనకు ఎలాంటి మేలు చేస్తుందంటే..
జీర్ణక్రియకు సహాయపడుతుంది
పచ్చి బొప్పాయి మనం తిన్న ఆహారం సులువుగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. దీనిలో పాపైన్ అనే జీర్ణ ఎంజైమ్ ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్య రాకుండా చేస్తుంది. అలాగే పేగు చికాకు, కడుపులో అధిక శ్లేష్మం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
చర్మ సమస్యలను తగ్గిస్తుంది
పచ్చి బొప్పాయిని తీసుకోవడం వల్ల చర్మానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చి బొప్పాయి సోరియాసిస్, మొటిమలు, స్కిన్ పిగ్మెంటేషన్, మచ్చలు, చర్మం ఎర్రబడటం వంటి ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది. పచ్చి బొప్పాయి గుజ్జును మెత్తగా చేసి గాయాలకు పెట్టొచ్చు. ఇది సంక్రమణను తగ్గించడానికి సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
బరువు తగ్గడానికి పచ్చి బొప్పాయిని ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అయితే ఇది మీరు ప్రత్యేకంగా బరువు తగ్గడానికి సహాయపడదు. కానీ ఇది ఆరోగ్యకరమైన బరువు తగ్గించే ఆహారాన్ని తీసుకోవడాన్ని ప్రోత్సహించడంలో సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండు లక్షణాలు మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. బరువు పెరిగే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
నెలసరి నొప్పిని తగ్గిస్తుంది
బొప్పాయిలో ఉండే ఎన్నో పోషకాలు మహిళలకు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే బొప్పాయి ఆకులు రుతుక్రమ నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. బొప్పాయి ఆకు, చింతపండు, ఉప్పును నీటితో కలిపి తీసుకుంటే నెలసరి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
మంటను తగ్గిస్తుంది
ఆస్తమా, ఆస్టియో ఆర్థరైటిస్, గౌట్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగులకు మేలు చేసే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పచ్చి బొప్పాయిలో పుష్కలంగా ఉంటాయి. ధూమపానం చేసేవారిలో ఊపిరితిత్తుల వాపును తగ్గించే విటమిన్ ఎ కూడా దీనిలో ఉంటుంది. తాజా పచ్చి బొప్పాయి రసం ఎర్రబడిన టాన్సిల్స్ కు కూడా చికిత్స చేస్తుంది.
