బరువును తగ్గించడం నుంచి రక్తపోటును కంట్రోల్ చేయడం వరకు.. మునగాకు టీతో ఎన్ని లాభాలున్నాయో..!
మునగాకు టీ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఇదొక శక్తివంతమైన పానీయం అంటున్నారు నిపుణులు. ఈ టీని తాగితే ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. అలాగే..

మునగాకు టీని మునగాకు చెట్టు ఆకులతో తయారుచేస్తారు. మునగ చెట్టును మిరాకిల్ ట్రీ అని కూడా అంటారు. మునగాకు టీని ఇప్పుడు కాదు ఎన్నో శతాబ్దాలుగా వాడుతున్నారు. దీన్ని సాంప్రదాయ వైద్యంలో ఎన్నో రోగాలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ టీ ఎక్కువ ప్రాముఖ్యతను పొందింది. ఎందుకంటే దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అసలు ఈ టీని తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గుతారు
శరీరంలో పేరుకుపోయిన కొవ్వు, కార్బోహైడ్రేట్ల శోషణను తగ్గించడానికి మునగాకు టీ సహాయపడుతుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారని పలు అధ్యయనాలు కనుగొన్నాయి. ఈ టీలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఈ టీ చక్కెర పానీయాలకు గొప్ప ప్రత్యామ్నాయం. మునగాకు టీలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మంటతో పోరాడటానికి, జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి.
రక్తపోటు నియంత్రణ
మునగాకు టీ రక్తపోటు స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుందని కనుగొన్నారు. జర్నల్ ఆఫ్ హ్యూమన్ హైపర్టెన్షన్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం మునగాకు టీ ని తాగిన వారిలో సిస్టోలిక్, డయాస్టొలిక్ రక్తపోటు తగ్గిందని కనుగొన్నారు.
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు
మునగాకు టీలో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలతో పాటుగా శక్తివంతమైన శోథ నిరోధక సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీర మంటను తగ్గించడానికి సహాయపడతాయి. ఇది గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటుగా ఎన్నో ఇతర రోగాలను కూడా తగ్గిస్తుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
మునగాకు టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, హానికరమైన వ్యాధికారకాల నుంచి శరీరాన్ని రక్షించడానికి సహాయపడతాయి. రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు అవసరమైన విటమిన్ సి కూడా దీనిలో పుష్కలంగా ఉంటుంది.
యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్
మునగాకు టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సెల్యులార్ నష్టాన్ని కలిగించే శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. అలాగే వృద్ధాప్య ప్రక్రియను నెమ్మది చేస్తాయి. ఈ టీలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరగడానికి సహాయపడే సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
జీర్ణ ఆరోగ్యం
మునగాకు టీ గట్ లో మంటను తగ్గిస్తుంది. అలాగే గట్ లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగేందుకు సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఈ టీ ఉబ్బరం, మలబద్ధకం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
పోషకాలు పుష్కలంగా ఉంటాయి..
మునగాకు టీ లో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, కాల్షియంతో పాటుగా వివిధ విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. మాంసం తినని వారికి ఇది బెస్ట్ పోషక పానీయం.