Eating Breakfast: సాధారణంగా చాలామంది డైటింగ్ చేస్తూ ఉదయం అల్పాహారం తినడం మానేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల గుండె జబ్బులు డయాబెటిస్ వంటి సమస్యలు చుట్టుముడుతుంటాయి. మరి అల్పాహారం తీసుకోకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలుసుకుందాం...

ఈ మధ్యకాలంలో చాలా మంది అధిక శరీర బరువు పెరగటం వల్ల శరీర బరువు తగ్గడం కోసం డైటింగ్ పేరుతో ఉదయం అల్పాహారం తినడం మానేస్తున్నారు. ఉదయం లేవగానే నిమ్మరసం తేనే కలిపిన పానీయం సేవిస్తూ అల్పాహారం స్కిప్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుందని అయితే నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఇలా ఉదయం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు.

ఇకపోతే చాలామంది ఉదయం పని ఒత్తిడి కారణంగా పని హడావిడిలో ఉంటూ ఒకవైపు ఉద్యోగానికి ఆలస్యం అవుతుందన్న తరుణంలో కూడా ఇలా అల్పాహారం తినడానికి సమయం కేటాయించలేక తినడం మానేస్తుంటారు. అల్పాహారం తినకపోవడం వల్ల పెద్ద ఎత్తున అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలి. మరి అల్పాహారం తినకపోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయనే విషయానికి వస్తే..


ఉదయం అల్పాహారం తినకపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అల్పాహారం తినకపోవడం వల్ల ఛాతిలో నొప్పి మంట ఏర్పడి గుండె జబ్బులు రావడానికి కారణం అవుతాయి. ఇక డయాబెటిస్ వచ్చే సమస్యలు కూడా అధికంగా ఉంటాయి. మనం తిన్న తినకపోయినా మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది. ఇలా రక్తంలో చక్కెర శాతం అధికమవడం వల్ల డయాబెటిస్ వచ్చే సమస్యలు ఉంటాయి.

* ఇక అల్పాహారం తినకపోవడం వల్ల అధికంగా శరీర బరువు కూడా పెరుగుతారు.

* జీవక్రియ నెమ్మదిస్తుంది.

* చిరాకు, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.

* జుట్టు రాలడం సమస్య అధికమవుతుంది.

* క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు అధిక మవుతాయి.

* తలనొప్పి రావడం, నెలసరిలో మార్పులు రావడం వంటి సమస్యలు అధికమవుతాయి. అందుకే ఉదయం తప్పనిసరిగా అల్పాహారం తినాలని నిపుణులు చెబుతున్నారు.