సాధారణంగా చాలామంది కరివేపాకు చాలా తేలికగా తీసి పడేస్తారు. అయితే కరివేపాకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని విషయం మనకు తెలిసిందే. ఇలా కరివేపాకు వల్ల వంశపారంపర్య రోగాలను కూడా తరిమి కొట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

మనం తయారు చేసుకునే ఆహార పదార్థాలకు రుచి రావాలంటే తప్పనిసరిగా కరివేపాకును ఉపయోగిస్తాము ఇలా ప్రతి ఒక్క వంటకంలోను కరివేపాకు మనకు కనబడుతుంది అయితే చాలామంది కరివేపాకును తీసి అవతల పడేస్తారు. ఇలా కరివేపాకుని పడేయడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టేననే విషయం మనకు తెలిసిందే. ఇలా కరివేపాకును పడేయటం వల్ల మన శరీరానికి కావాల్సిన ఎన్నో ప్రయోజనాలను కోల్పోతాము.

కరివేపాకులు ఎన్నో రకాల పోషక విలువలు విటమిన్లు ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి.ఇది జీర్ణ క్రియను మెరుగుపరచడంలోనూ మలబద్ధకాన్ని తగ్గించడంలోను దోహదపడతాయి.ఇక కంటి చూపును మెరుగుపరచడంలో కూడా కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుంది.ఇలా ఎన్నో ప్రయోజనాలు కలిగినటువంటి ఈ కరివేపాకును తరచు ఆహారంలో తీసుకోవడం వల్ల కొన్ని వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు కూడా తొలగిపోతాయి.

ప్రస్తుత కాలంలో చాలామంది బాధపడుతున్నటువంటి సమస్యలలో మధుమేహ వ్యాధి ఒకటి. ఈ మధుమేహ వ్యాధి కొందరికి వంశపారంపర్యంగా వస్తూనే ఉంటుంది. ఇలా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఈ మధుమేహ వ్యాధిని తరిమి కొట్టడానికి కరివేపాకు ఎంతో కీలకంగా పనిచేస్తుంది. ఇలా మధుమేహ వ్యాధి నుంచి విముక్తి పొందాలంటే బాగా ముదిరిన కరివేపాకు ఆకులను రోజుకు రెండు లేదా మూడు తినడం వల్ల క్రమక్రమంగా ఈ మధుమేహ వ్యాధి నుంచి బయటపడవచ్చు.

ఈ విధంగా ముదిరిన కరివేపాకును ప్రతిరోజు క్రమం తప్పకుండా మూడు నెలల పాటు తినటం వల్ల ఈ వంశపారంపర్యమైనటువంటి మధుమేహ వ్యాధికి చెక్ పెట్టవచ్చు. ఇక మధుమేహ వ్యాధిని ప్రారంభ దశలో కనుక గుర్తిస్తే వెంటనే పసుపు కలబంద జిగురులను కలిపి తీసుకోవటం వల్ల క్లోమం కాలేయ గ్రందుల క్రియలను నియంత్రించబడతాయి. ఇలా మధుమేహ వ్యాధికి కరివేపాకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందని చెప్పాలి.