ఎండాకాలం వచ్చేసింది. ఈ సీజన్ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలనే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా కీరదోసకాయను తప్పకుండా తినాలి. ఎందుకంటే..
ఎండాకాలం మొదలై కొన్ని రోజులే అయినా.. ప్రస్తుతం ఎండదు మండుతున్నాయి. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది. ఈ ఎండల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీనివల్ల బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఈ సీజన్ లో మిమ్మల్ని మీరు లోపలి నుంచి చల్లగా ఉండేలా ఆహారం తీసుకోవాలి. కొన్ని రకాల పండ్లు, కూరగాయల్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది. అలాంటి కూరగాయల్లో కీరదోసకాయ ఒకటి. కీరదోసకాయ వేసవిలో తప్పక తినాల్సిన కూరగాయ. ఎందుకంటే ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది, లోపలి నుంచి మిమ్మల్ని చల్లగా ఉంచుతుంది. మీ చర్మాన్ని ఆరోగ్యంగా, రిఫ్రెష్ చేస్తుంది. దీన్ని ఈ సీజన్ లో తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
దోసకాయల్లో 95 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇవి శరీరంలోని విషాన్ని తొలగిస్తాయి. అలాగే శరీరాన్ని బాగా హైడ్రేట్ గా ఉంచడానికి, పోషణకు సహాయపడతాయి. కీరదోసకాయల్లో నీటి శాతం ఉండటం వల్ల బాడీ క్లెన్సర్ గా కూడా పని చేస్తుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది.
కుకుర్బిటాసిన్ బి అనేది దోసకాయలలో విరివిగా ఉండే సహజ పదార్థం. దీనికి క్యాన్సర్ ను నిరోధించే సామర్థ్యం ఉంటుంది. అలాగే దోసకాయ తొక్క డైటరీ ఫైబర్ కు మంచి మూలం. ఇది మలబద్దకాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఉదరం నుంచి విష సమ్మేళనాలను తొలగింస్తుంది. పెద్దప్రేగు క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది.
కీరదోసకాయలు ఫైబర్, పొటాషియం, మెగ్నీషియానికి మంచి వనరు. ఈ పోషకాలు రక్తపోటును తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పని చేస్తాయి. దీనిలోని అధిక పొటాషియం, నీటి కంటెంట్ రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడతాయి.
దోసకాయలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాదు.. అందానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది టోనర్ గా చర్మానికి మంచి చేస్తుంది. ఉబ్బు, నల్లటి వలయాల సంకేతాలను తగ్గిస్తుంది. వేసవి కాలంతో సంబంధం ఉన్న చికాకు, ఎరుపు, మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దోసకాయలలో సిలికా ఉంటుంది. ఇది జుట్టు, గోరు సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది.
దోసకాయలను తింటే ప్రేగు కదలికలు మెరుగుపడతాయి. మలబద్దకానికి నిర్జలీకరణం ఒక ప్రధాన ప్రమాద కారకం. దోసకాయలలో నీరు ఎక్కువగా ఉంటుంది. ఆర్ద్రీకరణను ప్రోత్సహిస్తుంది. హైడ్రేటెడ్ గా ఉండటం మలం స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని నివారించడానికి, క్రమబద్ధతను నిర్వహించడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.
కీరదోసకాయలో విటమిన్ సి, కెఫిక్ ఆమ్లం సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మ చికాకు లేదా ట్యాన్డ్ చర్మం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మ వాపును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కీరదోసకాయలో ఉండే ఆస్ట్రిజెంట్ గుణం స్కిన్ టాన్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.
