సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉదయం లేవగానే ఒక కప్పు చాయ్ తాగనిదే రోజు గడవదు. అందుకే ప్రతిరోజు ఉదయం లేవగానే చాలామంది వివిధ రకాల టీ తాగుతూ వారి రోజున ప్రారంభిస్తారు. ఈ క్రమంలోనే కొందరు సాధారణ చాయ్ తాగగా మరికొందరు గ్రీన్ టీ తాగుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం బ్లూటీ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ బ్లూటీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం... 

బ్లూటీ ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక కప్పు తాగటం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లో పెద్ద మొత్తంలో ఉండటం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇక ఈ టీలోకి కాస్త నిమ్మరసం తేనె కలుపుకొని తాగటం వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. మనకు మార్కెట్లో ఇతర టీ పొడి లాగే బ్లూటీ తయారు చేసుకోవడానికి బటర్ ఫ్లై పీ పౌడర్ మార్కెట్లో అందుబాటులో ఉంది.

ఇందులో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు కనిజలవనాలు విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల ఈ టీ తాగడంతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున ఇది మధుమేహ వ్యాధితో బాధపడే వారికి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ టీ ప్రతిరోజు తాగటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించబడుతుంది.

ఈ బ్లూ టీ తాగటం వల్ల ఇందులో ఉన్నటువంటి ఎసిటైల్ కోలిన్ ఆల్జీమర్స్ వ్యాధి తగ్గించడంలో దోహదపడుతుంది. అలాగే మెదడుపై ఈ టీ తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తూ జ్ఞాపక శక్తి పెరగడానికి మెదడు పనితీరును పెంచడానికి దోహదం చేస్తుంది. ఇక ఈ టీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటికి వచ్చే అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.ఈ టి కేవలం ఆరోగ్య ప్రయోజనాలను మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది.