Asianet News TeluguAsianet News Telugu

ఆస్తమా పేషెంట్లకు ఈ ఆహారాలు చాలా మంచివి.. తప్పకుండా తినండి

శ్వాస ఆడకపోవడం, దీర్ఘకాలిక దగ్గు, మగత, శ్వాస తీసుకునేటప్పుడు ఈలల శబ్దం రావడం ఇవన్నీ ఆస్తమా లక్షణాలు. అయితే ఆస్తమా పేషెంట్లు ఏవి పడితే అవి తినకూడదు. 
 

foods for asthma patients rsl
Author
First Published Mar 21, 2023, 1:58 PM IST

ఉబ్బసం ఒక అలెర్జీ వ్యాధి. ఇది ఊపిరితిత్తులను ముఖ్యంగా వాయుమార్గాలను ప్రభావితం చేస్తుంది. ఈ ఆస్తమాకు ప్రధాన కారణం అలెర్జీ కారకాలకు గురికావడం. ఆస్తమా వల్ల శ్వాస ఆడకపోవడం, దీర్ఘకాలిక దగ్గు, మగత,శ్వాస తీసుకునేటప్పుడు ఈలల శబ్దం రావడం వంటి సమస్యలు వస్తాయి.  వాతావరణం, వాయు కాలుష్యం, జీవనశైలి, ఆహారాలు వంటివి కూడా ఉబ్బసంతో సంబంధం కలిగి ఉంటాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మరి ఆస్తమా పేషెంట్లు తమ డైట్ లో ఎలాంటి ఆహారాలను చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

అల్లం...

అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి అల్లం మన శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఆస్తమా పేషెంట్లు నీళ్లలో అల్లం వేసి మరిగించి తాగితే ఆస్తమా లక్షణాలు తగ్గుతాయి. 

వెల్లుల్లి

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా  ఉండే వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇవి జలుబును తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. పచ్చి వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా చేసి రోజుకు ఒకసారి గ్లాసు నీటితో కలిపి తీసుకోవచ్చు. అలాగే అరకప్పు పాలలో మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి మరిగించి తాగితే కూడా మంచిది.

పసుపు

పసుపులో ఉండే కర్కుమిన్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. ఇవి ఆస్తమా రోగులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి.

మిరియాలు

మిరియాలు కూడా ఆస్తమా పేషెంట్లకు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. శీతాకాలంలో ఉబ్బసం, అలెర్జీ లక్షణాలు ఎక్కువవుతాయి. నల్ల మిరియాలలో శరీరంలోని వాపును తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. 

ఆకుకూరలు

ఆస్తమా రోగులకు ఆకు కూరలు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా బచ్చలికూర, పాలకూరలో విటమిన్లు, పీచు, మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆస్తమా రోగులు ఈ ఆకు కూరలను ఖచ్చితంగా తినాలి.

గ్రీన్ టీ

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే గ్రీన్ టీ శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. అందుకే ఆస్తమా రోగులు గ్రీన్ టీ ని ఖచ్చితంగా తాగాలని నిపుణులు చెబుతున్నారు. 

మొక్కజొన్న

మొక్కజొన్న కూడా ఆస్తమా పేషెంట్లకు మంచి మేలు చేస్తుంది. మొక్కజొన్నలో ఉండే విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్, జింక్, కెరోటినాయిడ్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios