చర్మ క్యాన్సర్ కేసులు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిజమేంటంటే.. క్యాన్సర్లను ప్రారంభ దశలోనే గుర్తిస్తే దీనిని పూర్తిగా నయం చేసుకోవచ్చు. లేదంటే..
చర్మ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేసే అత్యంత సాధారణమైన క్యాన్సర్లలో ఒకటి. పాశ్చాత్య దేశాలలో ఈ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రకమైన క్యాన్సర్ కేసులు భారతదేశంలో కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ దీనిని నయం చేయొచ్చు. ముఖ్యంగా ప్రారంభంలో గుర్తించినప్పుడు మాత్రమే.
చర్మ క్యాన్సర్ అంటే ఏంటి?
సూర్యుడి నుంచి వచ్చే యూవీ రేడియేషన్ వల్ల కలిగే చర్మం నష్టం జరుగుతుంది. దీంతో చర్మ కణాలు అసాధారణ పెరుగుదలకు గురైనప్పుడు.. అది ఒక రకమైన చర్మ క్యాన్సర్ కు కారణమవుతుంది. మెలనోమా, బేసల్ సెల్ కార్సినోమా (బిసిసి), పొలుసుల సెల్ కార్సినోమా (ఎస్సిసి) అత్యంత ప్రబలమైన రూపాలు.
చర్మ క్యాన్సర్ సంకేతాలు
కొత్త పుట్టు మచ్చలు: అదనపు చర్మం లేదా పుట్టుమచ్చలలో కొత్త పెరుగుదలను మీరు గమనించినట్లయితే.. వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. చర్మ క్యాన్సర్ వల్ల ఎన్నో కొత్త పుట్టుమచ్చలు పెరుగుతాయి. అందులోనూ వాటి రంగుల్లో తేడా ఉంటాయి. కొన్ని పుట్టుమచ్చలు క్రమరహిత అంచులను కూడా కలిగి ఉంటాయి. దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. టెస్టులు చేయించుకోవడం మంచిది.
ఎప్పుడూ గాయాలు: సకాలంలో నయం కాకపోవడం, గాయల నుంచి చీము లేదా రక్తస్రావం అయితే ఆ గాయాన్ని టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ఇది చర్మ క్యాన్సర్ కు సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు.
చర్మం ఆకృతి : చర్మ క్యాన్సర్ లో అత్యంత గుర్తించదగిన మార్పులలో ఒకటి చర్మం ఆకృతి. చర్మం క్యాన్సర్ వస్తే మీ స్కిన్ రఫ్ గా లేదా గడ్డకట్టిన పొలుసుల పాచెస్ రూపంలో కనిపిస్తుంది. ఇలాంటి మార్పులు మీ చర్మంపై కనిపిస్తే వీలైనంత తొందరగా పరీక్షించుకోండి.
పుట్టుమచ్చల పరిమాణం: మీ పుట్టుమచ్చల పరిమాణం, ఆకారం, రంగు లేదా ఆకృతి మారితే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. చర్మ క్యాన్సర్ వల్ల పుట్టుమచ్చల పరిమాణం మారుతుంది. అంతేకాదు అవి వేరే రంగులో ఉంటాయి. ఇవి గుర్తుంచుకోవలసిన హెచ్చరిక సంకేతాలు.
