మాంసం పోషకాల భాండాగారం. దీనిలో కాల్షియం, ప్రోటీన్, జింక్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రోటీన్ ను ఎక్కువగా తీసుకోవాలని కొందరు మాంసాన్ని ఎక్కువగా తింటుంటారు. కానీ మాంసాన్ని ఎక్కువగా అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇది ఎముకలను బలహీనపరుస్తుంది. అంతేకాదు ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది కూడా.
మాంసంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మాంసాన్ని ఎక్కువగా తింటే ఎక్కువ పోషకాలు అందుతాయని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రోటీన్ ఒక్క మాంసంలోనే ఉండదన్న సంగతిని మర్చిపోకూడదు. ముఖ్యంగా పోషకాలు పొందాలని ఒక్క మాంసాన్నే తినకూడదు. ఎందుకంటే జంతు ప్రోటీన్ ఎముకలను బలహీనపరుస్తుంది. పలు అధ్యయనాల ప్రకారం.. మొక్కల ఆధారిత ప్రోటీన్లతో పోల్చితే.. జంతు ఆధారిత ప్రోటీన్లే ఎముకలను బలహీనపరుస్తాయని తేలింది. ఎన్నో పరిశోధనల ప్రకారం.. మాంసాన్ని ఎక్కువగా తినే వారికి బోలు ఎముకల వ్యాధి, ఎముకల పగుల్లు వచ్చే ప్రమాదం ఉందని తేలింది.
మాంసం నిజంగా ఎముకలను బలహీనపరుస్తుందా?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం మన ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఇది కాల్షియం లోపాన్ని కలిగిస్తుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రోటీన్లు చాలా అవసరం. ఇందుకోసం ఒక్క జంతుప్రోటీన్ నే తీసుకోవాలని రూల్ లేదు. నిజం చెప్పాలంటే రెడ్ మీట్ ఎముకలను బలహీనంగా చేస్తుంది.
అయితే జంతు ప్రోటీన్ కూడా మన ఆరోగ్యానికి అవసరం. ఎందుకంటే ఇది ఎముకల నిర్మాణానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగని మొత్తం జంతుప్రోటీన్ నే తీసుకుంటే లేని పోని సమస్యలు వస్తాయి. అందుకే పాలు, పాల ఉత్పత్తులు, చికెన్, చేపలు, మొక్కల ఆధారిత ప్రోటీన్ ఫుడ్ ను కూడా మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోండి.
ప్రోటీన్లు ఒక్క మాంసంలోనే కాదు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాల్లో కూడా ఉంటాయి. నిపుణుల ప్రకారం.. మాంసంలో భాస్వారం టూ కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కాల్షియాన్ని బయటకు పంపుతుంది. దీనివల్ల ఎముక ఆరోగ్యానికి కావాల్సిన ఖనిజాలు అందకపోవడంతో ఎముకలు బలహీనపడతాయి.
జంతు ప్రోటీన్ ముఖ్యంగా రెడ్ మీట్ ను ఎక్కువగా తీసుకకోవడం వల్ల రక్తం ఆమ్లంగా మారతుంది. ఇది ఎముకలపై ఉన్న కాల్షియం పొరను తొలగిస్తుంది. దీంతో ఎముకలు బలహీనపడతాయి.
2014 లో ప్రచురించబడిన నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం.. సరైన మొత్తంలో కాల్షియాన్ని తీసుకుంటే మీ ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, జంతు ఆధారిత ఆహారాన్ని తగ్గించడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్ 2 డయాబెటీస్ వంటి ఎన్నో వ్యాధులొచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ డి, కాల్షియం చాలా చాలా అవసరం.
